పాకిస్తాన్లో ఎన్నికలు జరుగుతాయి... ఒక అధ్యక్షుడునీ ఎన్నుకుంటారు.. కానీ ఇదంతా జరిగేది కేవలం పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ ఆధీనంలోనే. పాకిస్థాన్లో ఎన్నికల్లో ఒక ప్రధానిని ఎన్నుకున్నప్పటికీ చివరికి ఆ అధ్యక్షుడు పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ చేతిలో కీలు బొమ్మల మారిన పోతాడు. వాళ్ళు చెప్పింది ఆచరించవలసి వుంటుంది. అందుచే పాకిస్తాన్లో అభివృద్ధి రోజురోజుకు కుంటుపడుతుంది తప్ప  ఎక్కడ పెరిగిన దాఖలాలు మాత్రం కనిపించవు. అయితే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ భారత్ పై విమర్శలు చేయడంలో కాస్త వెనక్కి తగ్గిన నేపథ్యంలో పాకిస్థాన్ కు అస్సలు నచ్చడంలేదు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ను ఎప్పుడెప్పుడు గద్దె  దించాల అని  పాకిస్థాన్ సైన్యం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

 


 ఈ క్రమంలోనే పాకిస్తాన్ సైన్యం తమకు కొత్త నాయకుడిని షాహిద్ అఫ్రిది రూపంలో వెతుక్కుంది . ఇక షాహిద్ అఫ్రిది కూడా భారత్  పై తీవ్రస్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే  పాకిస్తాన్ ప్రజలందరికీ ప్రీతిపాత్రుడు గా మారిపోతుంటారు . ఎందుకంటే భారత్ పై   ఎవరు ఎక్కువ విమర్శలు చేస్తే వారే పాకిస్తాన్లో అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. ప్రస్తుతం షాహిద్ అఫ్రిదీ భారత్పై తీవ్ర స్థాయిలో గత కొన్ని నెలలుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే త్వరలో ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దించి షాహిద్ అఫ్రిదీ అధ్యక్షుడు  సీట్లో  కూర్చో పెడతారు అని అనుకుంటున్న తరుణంలో.. తాజాగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ముషారఫ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి. 


 ఆఫ్రిది కి సైన్యం సపోర్టు ఉన్నప్పటికీ లోకల్ గా మాత్రం అంతగా ఫాలోయింగ్ లేకపోవడంతో ఆఫ్రిది నీ  పక్కకు నెట్టి ఆ స్థానంలోకి ముషారఫ్  మళ్లీ రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గతంలో ప్రధానమంత్రిగా ఉన్న ముషారఫ్ ను  సైన్యంలోని ఓ వర్గం దారుణంగా తొక్కేసింది అని చెప్పాలి. మరోవైపు సైన్యంలో ముషారఫ్ వర్గం మాత్రం స్ట్రాంగ్  గానే ఉంది. అయితే తాజాగా ముషారఫ్ ఏం  వ్యాఖ్యలు చేశారు అంటే.. భారతదేశంలో మోడీ  ప్రధాని అయిన నాటి నుంచి పాకిస్థాన్కు అనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్ చులకనగా మారిపోయిందని.. ప్రపంచ దేశాలన్నీ పాకిస్థాన్ను ఉగ్రవాద దేశంగా చూస్తున్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం ముషారఫ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: