ప్రపంచ దేశాలను ప్రస్తుతం గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో లక్షల సంఖ్యలో ప్రజలు బాధితులుగా మారుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే అతి భయంకరమైన ఈ వైరస్ చైనీయుల ఆహారపు అలవాట్ల వల్లే వచ్చిందని ప్రపంచ దేశాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. చైనీయులు కుక్క, పాము, కప్ప, బొద్దింక ఇలా జంతువులు, కీటకాలు తినటం వల్ల కరోనా వచ్చిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.  ముఖ్యంగా కరోనా గబ్బిలాలు తినడం వల్లనే వచ్చిందని కోడై కూస్తున్నారు. ఇక చైనాలోని వుహాన్‌ నగరంలోని జంతువధశాల కేంద్రంగా 2019, డిసెంబర్‌ నెలలో కరోనా వైరస్‌ ప్రబలిన నేపధ్యంలో అందరూ చైనా ను టార్గెట్ చేస్తున్నారు. ఇలా ఏది పడితే అది తిని దిక్కుమాలిన వైరస్ లు ప్రబలిపోయేలా చేస్తున్నారని చైనీయుల ఆహారపు అలవాట్లపై ఇప్పటికే రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

 ఈ నేపథ్యంలో చైనాలోని షెన్‌జెన్‌ సిటీలో పిల్లులు, కుక్కల విక్రయంపై నిషేధం విధించింది. మే 1వ తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఈ కొత్త చట్టం ప్రకారం కుక్కలు, పిల్లులు, బల్లులు, పాములతో పాటు రక్షిత వన్యప్రాణులకు తినడాన్ని నిషేధించారు. అయితే ఇంతజరుగుతున్నా చైనీయులు మాత్రం తమ తిండి విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేలా లేరనిపిస్తుంది. ప్రభుత్వం ఈ ఏడాది డాగ్-మీట్ ఫెస్టివల్ నిర్వహించడంపై విముఖత చూపిస్తుంది. కరోనా నేపథ్యంలో ఇలాంటి ఫెస్టివల్స్ కి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది.

 

కానీ వారు మాత్రం ససేమిరా అంటున్నట్లు వార్తలువ వస్తున్నాయి. అంతే కాదు మెయిన్ ల్యాండ్ చైనాలోని యులిన్ నగర ప్రజలు ప్రతి ఏడాది లానే ఈ సంవత్సరం కూడా డాగ్‌-మీట్ మీట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ ఏడాది చైనా 10 రోజుల వార్షిక వేడుకలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా యులిన్ లోని జంతు హక్కుల కార్యకర్త జాంగ్ కియాన్కియాన్ మాట్లాడుతూ..కుక్క-మాంసం వినియోగాన్ని నిషేధించడానికి ఇంకా చాలా రోజులు పడుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: