పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కొనసాగే ఒక కార్యకర్త దారుణాలకు పాల్పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని అతను చేస్తున్న ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కానీ నేరాలకు పాల్పడుతున్న ఎంతటి వాడైనా ఏదో ఒకరోజు బయట పడాల్సిందే. తాజాగా ఇతను కూడా ఒక ముసలవ్వ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చాడు. నిజానికి పవన్ కళ్యాణ్ తన సొమ్ము పోగొట్టుకుంటాడు కానీ ఇతరుల సొమ్మును ఎప్పుడూ ఆశించడు. ప్రజల కోసం సహాయం చేయాలనే ఉద్దేశంతోనే తాను జనసేన పార్టీని స్థాపించాడు. అటువంటి నిజాయితీ అయిన పార్టీ లో అక్రమాలకు అన్యాయాలకు పాల్పడే ఒక కార్యకర్త ఉండడం ప్రస్తుతం అందరి విస్మయానికి కారణమవుతుంది. 


పూర్తి వివరాలు తెలుసుకుంటే... విజయవాడ లోని పాయకాపురం లో సుందరయ్యనగర్ ఏరియా లో లక్ష్మి అనే వృద్ధురాలు ఒంటరిగా జీవనం సాగిస్తుంది. ఆమె కూతురు కి పెళ్లి కాగా కొడుకు హైదరాబాద్ నగరంలో జీవనం సాగిస్తున్నాడు. భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు అని తెలుస్తుంది. దీంతో ఆమె ఒక్కటే సుందరయ్య నగర్ ఏరియా లో నివసిస్తోంది. అయితే కొన్ని నెలల క్రితం జనసేన పార్టీ కార్యకర్త శ్యాంసన్ తన ఇంటికి వచ్చి... పవన్ కళ్యాణ్ వృద్ధులకు పదివేల రూపాయల పింఛన్ ఇస్తున్నారని... అందుకోసం సంతకాలు చేస్తే సరిపోతుందని నమ్మబలికి ఏవో సంతకాలు తీసుకున్నాడని లక్ష్మి ఆరోపిస్తోంది. 


సంతకాలు తీసుకున్న ఆరు నెలల తర్వాత తన ఇంటికి వచ్చి ఆ ఇల్లు అతడి దేనని బెదిరిస్తూ ఇంటిని బేరానికి పెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏం చేయాలో తెలియని ఆ వృద్ధురాలు చిట్టచివరికి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకూ జనసేన కార్యకర్త శ్యాంసన్ లక్ష్మీ చేస్తున్న ఆరోపణలపై స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: