ప్యాంటు స్టిక్కర్ ఆధారంగా ఒక హంతకుడిని ఛేదించిన సంఘటన హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి చెందిన వెంకట శివ ప్రసాద్ అనే వ్యక్తి 30 సంవత్సరాల కిందట హైదరాబాద్ నగరానికి వలస వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక ఇటీవల బాలనగర్ జంక్షన్ వద్ద ఒంటిపై తీవ్రమైన గాయాలతో అనుమానాస్పద స్థితిలో శివప్రసాద్ మరణించాడు. 

 


ఇక ఈ సంఘటనపై పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి బాలనగర్ ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను పరిశీలన చేయగా ఒక వ్యక్తి శివప్రసాద్ పై కూర్చొని ముఖంపై బలంగా కొట్టడంతో పాటు శివ ప్రసాద్ తలను బాదడం సీసీ కెమెరా లో చూశారు. ఇక నిందితుడి ముఖంపై మాస్కు ఉండడంతో గుర్తించడం పోలీసులకు కాస్త కష్టంగానే మారింది. ఇక నిందితుడి ప్యాంటు పై ఒక రేడియం స్టిక్కర్ ఆధారంగా పోలీస్ అధికారులు ఫతేనగర్ వంతెన కింద ఉండే వారి దుస్తులను పరిశీలించగా ఒక గుడిసెలో ఆ ప్యాంటు ను పోలీస్ అధికారులు గుర్తించారు.

 


ఇక దీని ఆధారంగా చేసుకొని నిందితుడిని బోయిన ఎంఎంఆర్ గార్డెన్స్ వద్ద నివాసముండే పాత నేరస్తుడు పి. నాగరాజు గా పోలీస్ అధికారులు గుర్తించడం జరిగింది. దీనితో పోలీస్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని వారి స్టైల్ లో విచారణ జరపగా నేరం ఒప్పుకున్నాడు. ఇటీవల తెల్లవారు జామున ఒక దుకాణంలో దొంగతనం చేస్తుండగా ఫుట్ పాత్ పై ఉన్న వెంకట శివ ప్రసాద్ నిందితున్ని చూసి గట్టిగా కేకలు వేయగా... తాను చేసిన తప్పు గురించి బయటకు చెప్పేస్తాడేమో అన్న భయ ఆందోళనలతో  అతడిని కొట్టి చంపేశానని పోలీస్ అధికారులకు నిందితుడు తెలియజేశాడు. అంతేకాకుండా హత్య చేసిన తర్వాత శివప్రసాద్ చేతిలో ఉండే రూ. 200 కూడా తీసుకొని అక్కడి నుంచి పరారైనట్లు పోలీస్ అధికారులకు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: