మైనింగ్ అనే దాని విషయంలో పర్యావరణపరమైన అంశాలు ఉంటాయి. అయితే మైనింగ్ ను ఎటువంటి పర్యావరణ సమస్యలు ఏర్పడకుండా జరపవచ్చు. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. అవి ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధికి కారణం అవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల్లో ఎవరు ఉన్నా ఒకరి విషయంలో మరొకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. 
 
అయితే రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా అనధికారికంగా అనుమతులు ఇస్తూ ఉండటంతో పార్టీలకు ప్రయోజనం చేకూరుతుందే తప్ప ప్రజలకు ఆ సొమ్ము జమ కావడం లేదు. అయితే ఒడిశా రాష్ట్రం మాత్రం మైనింగ్ ను అడ్డం పెట్టుకుని అద్భుతంగా ఎదుగుతోంది. ఒక ప్రముఖ జర్నలిస్టు ఒడిశా గురించి ప్రస్తావిస్తూ బ్రిటిష్ ఇండియాలో మద్రాస్ ప్రెసిడెన్సీ ఏలుబడి 300 ఏళ్లు ఉంటుందని చెప్పారు. 
 
కేరళలోని కొచ్చి నుంచి ఒడిశాలోని గంజాం వరకు లక్షద్వీపాలు, దక్షిణ భారతం అంతా మద్రాస్ ప్రెసిడెన్సీ చెప్పినట్టే ఉండేదని అన్నారు. స్వతంత్రం తరువాత ఒరిస్సా తో ఉన్న సాంస్కృతిక సంబంధాలు తెగిపోయాయి. అనేక తెగలు, కులాలు, సరిహద్దుల ఆధారంగా మన ఉమ్మడి రాష్ట్రం, ఒరిస్సా ఒడ్డీ, తెలగ జాతులుగా విడిపోయాయి. దీంతో ఒడిశా అంటే వెనుకబాటు అనే ముద్ర ఏర్పడింది. 
 
అయితే నేడు దక్షిణ భారతంలో ఒడిశా ఎంతో ముందుకు వెళ్లినట్టు అనిపిస్తోంది. మైనింగ్ తో తలరాతనే ఒడిశా మార్చుకుంది. ఖనిజ చట్టాల అమ్మకంలో ఒడిశాలో వచ్చిన ప్రక్రియ అక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కారణమైంది. ఏపీలో కూడా మైనింగ్ ను అధికారికంగా వినియోగించుకుంటే వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందని.... నిపుణులు చెబుతున్నారు.                                           
 

మరింత సమాచారం తెలుసుకోండి: