కరోనా వల్ల వ్యక్తిగత దూరం పాటించాల్సి వస్తోంది కాబట్టి ఉద్యోగాలకు వెళ్లేందుకు చాలా మంది ప్రజా రవాణా కంటే ద్విచక్ర వాహనాలవైపే మొగ్గుచూపుతున్నారు. పలు దేశాల ప్రభుత్వాలు ఉద్యోగులకు ఇలాంటి అభ్యర్థనలే చేస్తున్నాయి. 'నడక, ద్విచక్ర వాహనాలకే ప్రాధాన్యం ఇవ్వండి... చివరి ప్రయత్నంగా మీ ప్రైవేట్ కార్లను ఉపయోగించండి' అంటూ యూరోపియన్ పార్లమెంట్ ఉద్యోగులకు మెమో జారీ చేసింది. భౌతిక దూరం పాటించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సైక్లింగ్​ను సిఫార్సు చేసింది.

 

సైక్లింగ్​ వల్ల ఆర్థికంగా, పర్యావరణ పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాలుష్యం తగ్గించడానికి సైకిళ్లను ఉపయోగించాలని గతంలో ప్రభుత్వాలే అభ్యర్థించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మార్పు దానికదే రాబోతోంది. ఒకరికొకరు దూరం పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి రవాణా తీరు కనీసం కొంతవరకైనా మారే అవకాశం ఉంది.
ప్రస్తుతం తక్కువ సామర్థ్యంతో ప్రజారవాణా నడుస్తోంది కాబట్టి రహదారులపై ప్రత్యామ్నాయం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో సైకిల్​ ఆదర్శవంతమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.

 

సైకిల్ ఆదర్శవంతమే కానీ వీటిని పెద్ద ఎత్తున వాడేలా చేయడం సులభం కాదు. సురక్షితంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా సైకిల్ చోదకులు రోడ్లపై వెళ్లాలంటే.. మోటార్ వాహనాలతో సంబంధం లేకుండా ప్రత్యేకమైన రహదారి వ్యవస్థను ఏర్పాటుచేయాల్సి ఉంటుంది.డెన్మార్క్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో విస్తృతమైన ఇంటర్​సిటీ సైకిల్ దారులు ఉన్నాయి. ఫియెట్స్​పాడ్​ పేరుతో నెదర్లాండ్స్ పగడ్బందీగా సైకిల్ మార్గాన్ని ఏర్పాటు చేసింది. దుకాణాలు, ఇళ్లు, పాఠశాలలు, కార్యాలయాలను అనుసంధానిస్తూ వీటిని నిర్మించింది.ఇప్పుడు కొవిడ్-19 వల్ల ప్రపంచం మరింతగా సైకిళ్లవైపు మొగ్గుచూపుతోంది. 'తబీతో చలేగీ' అనే పంథా అవలంబిస్తోంది. నగరాలన్నీ సైకిల్ మార్గాలను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నాయి.మే నెలలో న్యూయార్క్​లో 40 మైళ్ల సైకిల్ దారులను ఏర్పాటు చేశారు.బొగొటా(కొలంబియా రాజధాని)లో 76 కిలో మీటర్ల మార్గాన్ని సైక్లింగ్​ కోసం నిర్మించారు.ఆక్లాండ్​లో కార్ పార్కింగ్ స్థలాన్ని తొలగించి ఆ ప్రాంతంలో 17 కి.మీల తాత్కాలిక బైక్​ లేన్​ను ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: