యాంకర్ సుమ.. ఎంటర్‌టైన్‌మెంట్ క్వీన్.. దశాబ్దాల తరబడి యాంకరింగ్ చేస్తున్నా.. ఏమాత్రం బోర్ కొట్టనీయకుండా చేయడం సుమ ప్రత్యేకత. యాంకరింగ్ అనగానే హొయలు పోతూ.. అందాలు ఆరబోసే ప్రయత్నాలు చేయకుండా.. సంప్రదాయబద్దంగా ఇంటిళ్లపాదీ చూసేలా యాంకరింగ్ చేయడం సుమకే చెల్లింది. అందుకే ఆమె దశాబ్దాల తరబడి నెంబర్ వన్ గా సత్తా చాటుతోంది.


అయితే తన ప్రోగ్రాములుతో బిజీగా ఉండే సుమ.. తాజాగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ పెట్టడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. రాజకీయాల జోలికి వెళ్లని ఈ యాంకర్ ను మరి అంతగా ఆకట్టుకున్నదేంటంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క  చేసిన సేవలు.. ఇటీవల గోదావరి వరదల సమయంలోనూ.. కరోనా సమయంలోనూ సీతక్క తన నియోజకవర్గం అంతా కలియతిరుగుతూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు.



అందుకే ఆమె సేవలను యాంకర్ సుమ మెచ్చుకున్నారు. కరోనా, వరదల వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సీతక్క వంటి వారి సేవలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. సీతక్క మనందరికీ స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం అంటూ మెచ్చేసుకుంది యాంకర్ సుమ. యాంకర్ సుమ ప్రశంసలను సీతక్క వినమ్రంగా స్వీకరించారు. కృతజ్ఞతలు తెలిపారు.     



కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు మంచి నేపథ్యమే ఉంది. నక్సలైట్ గా మారి కొన్నాళ్లు అక్కడ పని చేసి మళ్లీ మనసు మార్చుకుని జనజీవన స్రవంతిలోకి వచ్చారు సీతక్క. అత్యంత వెనుకబడిన గిరిజ జిల్లా ములుగు నుంచి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఓ ఎమ్మెల్యేలా కాకుండా.. అందరి మనిషిలా సేవలు అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు సీతక్క.


ప్రత్యేకించి కరోనా సమయంలో.. వరదల సమయంలో ఆమె సేవలను మెచ్చుకుంటూ కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు సైతం ట్వీట్లు పెడుతున్నారు. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలని మెచ్చుకుంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: