పూర్తి వివరాలు తెలుసుకుంటే... పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లి అయిన 34 ఏళ్ల మహిళ తన ఇంటికి సమీపంలో ఉన్న ఒక కుర్రాడితో లైంగిక సంబంధం పెట్టుకుంది. అయితే గత కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోవాలని తన 19 ఏళ్ళ ప్రియుడి పై ఒత్తిడి చేసింది. కానీ ఆ యువకుడికి ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం ఆమెకు ఎంత చెప్పినా వినకపోయేసరికి ఆమెను కడతేర్చాలని ఆ యువకుడు నిర్ణయించుకున్నాడు. ఆమెను చంపాలని దృడంగా నిశ్చయించుకున్న ఆ యువకుడు ఆమెను బార్ల తన మోటారు సైకిల్ ఎక్కించుకొని పురాణి గ్రామంలోని యాత్రి రెస్ట్ హౌజుకు తీసుకెళ్లాడు. అక్కడ పూటుగా మద్యం తాగి ఖాళీ బాటిల్ తో ఆమె తలపై బలంగా మోది చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుండి ఉడాయించాడు.
ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి రెండు సిమ్ కార్డులను, మహిళ నోట్లో ఒక గుడ్డను, మొబైల్ ఫోన్ ను సేకరించారు. అలాగే సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు నిందితుడిని కసగంజ్ వద్ద పట్టుకున్నారు. పోలీసుల విచారణలో అతడు నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి