అయితే నేర చరిత్ర ఉన్న ప్రజాప్రతినిధులపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.... గతంలో ఈ కేసు విచారణ గూర్చి కాలపరిమితి పెట్టుకున్న విషయాన్ని లేవనెత్తింది. అప్పట్లో ఈ కేసును ఎక్కువ సాగదీయకుండా ఒక సంవత్సరం లోపు అన్ని విషయాలను, సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని.. క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరిపి 2015 లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రజా ప్రతినిధులపై కేసులు యధాతధంగా కొనసాగుతున్నాయని సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో అమికస్ క్యూరీగా విజయ్ హన్సారియాను సుప్రీంకోర్టు ధర్మాసనం నియమించడం జరిగింది. అయితే శుక్రవారం జరిగిన విచారణలో విజయ్ హన్సారియా పలు సంచలన అంశాలను ధర్మాసనం ముందుంచారు. పలు రాష్ట్రాలకు సంబంధించి నేర చరిత్ర కలిగిన ప్రజాప్రతినిధుల వివరాలను ఆయన ధర్మాసనం ముందుకు తీసుకొచ్చి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో మొత్తం 118 మందిపై వివిధ రకాల కేసులు ఉన్నాయని వాటి వివరాలను ఆయన కోర్టుకు సమర్పించారు. ఈ 118 మందిలో ఒక సిట్టింగ్ ఎంపీపై యావజ్జీవ కారాగార జైలు శిక్ష పడే స్థాయిలో కేసు ఉందని విజయ్ హన్సారియా సుప్రీంకోర్టు లో నివేదించడం సంచలనంగా మారింది.
అదే తరహాలో వివిధ పార్టీల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన వివరాలను కూడా ఆయన కోర్టుకు అందజేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, విజయ రామారావు, జగ్గారెడ్డి, లింగయ్య,దొంతు మాధవ్, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితర నేతలు పేర్లు ఆ జాబితాలో ఉండటం విశేషం. బీజేపీ తరఫున.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, జితేందర్ రెడ్డి, సీఎం రమేష్ తదితరులపై కేసులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన నివేదించారు. ఎంఐఎం పార్టీ తరపున ఖాద్రి, అక్బరుద్దీన్, అసదుద్దీన్, బలాలా, కైసర్ మొయినుద్దీన్‌లపై కేసులున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పక్షాన చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, గువ్వల బాలరాజు, విద్యాసాగర్, శ్రీనివాస్, బాల్క సుమన్, దానం నాగేందర్, పువ్వాడ అజయ్ తదితర 28 మంది ప్రజా ప్రతినిధులపై కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీం కోర్టు ముందుంచారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి