అమెరికాలో వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు అరెస్ట్. అక్రమ నివాసం పేరిట విద్యార్థులను నిందితులుగా చూపి అమెరికా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.... ఎడ్యుకేషన్ అనంతరం ఎటువంటి జాబు చేయకుండా ఖాళీగా ఉండడం వల్ల వారికి ఈ పరిస్థితి ఏర్పడింది. అసలు విషయం ఏమిటంటే....భారతీయ విద్యార్థులైన 11 మందిని ఫెడరల్ లా ఎన్ఫోర్సుమెంటు పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్ధుల విషయంలో అమెరికా పోలీసులు తరచుగా విచారణ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే విదేశీ విద్యార్ధుల అక్రమ నివాసంపై ఆరాలు తీసినపుడు 15 మంది విదేశీ విద్యార్దులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 11 మంది భారతీయ విద్యార్ధులున్నారని బయటపడింది.

సాధారణంగా  చదువుకోవటానికి అమెరికాకు వెళ్ళిన విద్యార్ధులు చదువు పూర్తికాగానే వెంటనే ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. అలా జరగని తరుణంలో ఎవరి దేశాలకు వారు  తిరిగి వెళ్లి పోవాల్సి ఉంటుంది అది అక్కడ రూల్. కానీ పై 15 మంది విద్యార్ధులు మాత్రం తమ చదువు అయిపోయినా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపిటీ) అనే ప్రోగ్రాంలో భాగంగా అమెరికాలోనే ఉండిపోయారట. విద్యార్ధులు తాము చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగంలో ఓపీటీలో భాగంగా ఏడాది పాటు పనిచేయచ్చు. ఇదే సమయంలో స్టెమ్ ఓపీటీలో పాల్గొంటే అదనంగా మరో 12  నెలలు అక్కడే ఉండొచ్చు.

కానీ అరెస్టు చేసిన 15 మంది విద్యార్థులు ఉద్యోగాలు చేయకుండానే  ఓపీటీ వెసులుబాటును అడ్డం పెట్టుకుని అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు ఎన్ఫోర్సుమెంటు అధికారులు  గుర్తించి అరెస్టు చేయడం జరిగింది... వీరిలో 11మంది భారతీయులు. ఈ నేరానికి గాను పట్టుబడిన విద్యార్థులకు తగిన శిక్ష వేస్తామని అమెరికా పోలీసులు వెల్లడించారు... మరి ఎటువంటి శిక్ష ...?వారిని ఎప్పుడు విడిచి పెడతారు...? అన్న విషయం తెలియాల్సి ఉంది. అలాగే దీనిపై భారత విదేశాంగశాఖ ఏ విధంగా స్పందించనుందో చూడాలి.






  

మరింత సమాచారం తెలుసుకోండి: