మరి కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగేందుకు సర్వం సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లు అందర్నీ ఆకట్టుకుంది తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్  మధ్య ముఖాముఖి బేటీ మూడుసార్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ ముఖాముఖి భేటీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే కాదు... తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము  అన్న విషయాలను కూడా ప్రజలందరికీ చెప్పి ఆకర్షించే ప్రయత్నం చేశారు. కాగా మరో తొమ్మిది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే




 దీంతో అమెరికా రాజకీయాల్లో వాతావరణం మొత్తం హాట్ హాట్ గా మారిపోయింది. ఎవరు గెలుస్తారు అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. ఇప్పటికి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరికివారు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులన్నింటినీ చెబుతూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ ఉంటే.. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామొ  అన్న విషయాలను చెబుతూ ఉన్నారు జో బైడెన్ . ఇదిలావుంటే ఇటీవల అమెరికా లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది.



 అమెరికా చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ నమోదైంది... అమెరికా మొత్తంమీద 17 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు.  అందులో 5 కోట్ల 90 లక్షల మందికి పైగా సరికొత్త సిస్టం ద్వారా ఇప్పటికే ఓట్లు వేసేశారూ. దీంతో ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరుకుంది. పోలింగ్ కి తొమ్మిది రోజులు గడువు ఉన్న నేపథ్యంలో... బ్యాలెట్  ఈ మెయిల్ ద్వారా అమెరికన్లు  ముందస్తు ఓటు వేసారు. అయితే మునుపెన్నడూ అమెరికా చరిత్రలోనే లేనివిధంగా రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే భారీగా ఓట్లు నమోదైన నేపథ్యంలో తమ ప్రభుత్వం చేసిన పనులకు ఆకర్షితులై  అందరూ తమకు ఓటు వేశారని తమదే విజయమని అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తుంటే... ఇక ట్రంపు పనైపోయిందని తమదే విజయం అంటూ అటు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: