హైదరాబాద్ లో ఇప్పుడు మిస్సింగ్ కేసులు సంచలనంగా మారాయి. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉన్నారు. తాజాగా గత నాలుగు రోజుల్లో రెండు వందల మిస్సింగ్ కేసులు నమోదైనట్టు అధికారుల లెక్కల్లో ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 11 మంది మిస్ అయ్యారు అని అధికారులు చెప్పారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు అదృశ్యం అయ్యారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పిల్లలు మిస్సయ్యారు వివిధ కారణాలతో ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారని పోలీస్ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధి లోన్ని అంబికా నగర్కు  చెందిన తల్లి, కూతురు అదృశ్యం అయ్యారు. శృతి అనే మహిళ  2నెలల బాబును తీసుకోని నిన్న ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లి సుశీల ఛత్రినాక పీఎస్ లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరో కేసులో పోలీసులు మైనర్ బాలికతో పాటు యువతి అదృశ్యం అయింది. ట్యాంక్ బండ్ కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఓ మైనర్ బాలిక, ఆమె సోదరి  అదృశ్యం అయ్యారు. ఖైరతాబాద్ ప్రేమ్ నగర్ లో నివాసం ఉండే శాంతకుమారి  కూతురు పావని (20), శాంతకుమారి సోదరి కుమార్తె (15)లు  29 వ తేదీ రాత్రి ట్యాంక్ బండ్ చూసి వస్తానని వెళ్లారు.

తెల్లవారినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన శాంతకుమారి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. మరో చోట యువతి అదృశ్యం ఘటన సంచలనంగా మారింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో  19 ఏళ్ల  యువతి అదృశ్యం అయింది. నిమ్స్ ఆసుపత్రిలోని క్వార్టర్స్లో నివాసం ఉండే వనిత  (19) ఈనెల 29న  ఇంటర్వ్యూ కి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్లి  తిరిగి ఇంటికి చేరుకోక పోవడంతో కుటుంబ సభ్యులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా పదుల కేసులు నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: