రోజు రోజుకి కాలం మారుతుంది... ఆధునిక టెక్నాలజీ పెరుగుతుంది మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.. ఇక మనిషి డబ్బు సంపాదన వెంట పరుగులు పెడుతూ ఉంటే మానవ బంధాలు నశించి పోతున్నాయి. భార్యాభర్తల మధ్య ఎక్కడ అన్యోన్యత కనిపించడం లేదు. కన్న పిల్లల ను చూసుకోవడానికి కూడా సమయం ఉండడం లేదు. దీంతో పుట్టిన పిల్లలు కనీసం తల్లి దండ్రుల ప్రేమకు కూడా నోచుకోని పరిస్థితులు నేటి రోజుల్లో దాపురిస్తున్న  విషయం తెలిసిందే. ఇలాంటి క్రమంలో నే ప్రస్తుతం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



 ఇప్పుడు వరకు పుట్టిన పిల్లలను పెంచడానికి తల్లికి సెలవులు  ఇచ్చేందుకు ప్రభుత్వం నిబంధన ఉంది అనే విషయం తెలిసిందే. ఇక దాదాపు సంవత్సరం పాటు తల్లికి పిల్లలను చూసుకునేందుకు సెలవులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కేవలం పిల్లల చూసుకునేందుకు తల్లుల కు మాత్రమే కాదు తండ్రులకు కూడా సెలవు ఇవ్వాలని నిబంధన తీసుకొచ్చేందుకు ప్రస్తుతం ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లల బాధ్యత కేవలం తల్లులకే నా తండ్రుల కు ఉండదా అన్న అంశం తెర మీదికి వచ్చిన నేపథ్యం లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.



 ఈ క్రమంలోనే పిల్లలను పెంచడానికి తల్లులకే కాదు  ఇప్పుడు తండ్రులకు కూడా సెలవు ఇవ్వడానికి ప్రభుత్వం  సరి కొత్త రూల్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం లో కొనసాగుతున్న పురుషులు పిల్లల పెంపకం చూసుకోవడానికి... 365 రోజుల పాటు పూర్తి వేతనంతో కూడిన సెలవు ఇవ్వడంతోపాటు ఇక ఆ తర్వాత సుమారు 365 రోజులు 80శాతం వేతనంతో కూడిన సెలవు  ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. పిల్లలు పుట్టిన సందర్భంలో తల్లి మరణించినా  లేదా విభేదాలతో విడిపోయిన సందర్భాల్లో... పిల్లలను పెంచడం కోసం తండ్రికి ఈ సెలవులు ఇస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: