తాజాగా టర్కీ, గ్రీస్ దేశాలలో 7.0 రెక్టర్ స్కేల్ తీవ్రత తో భూకంపం సంభవించింది. ఈ భయంకరమైన భూకంపం అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. భవనాల శిథిలాల కింద పడిన చాలామంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ భవన శిథిలాల కింద వేల మంది చిక్కుకు పోయారని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. తీర ప్రాంత నగరం ఇజ్మీర్‌లో భూకంపం తీవ్రత భారీగా ఉండటంతో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఐతే ఈ ప్రాంత ప్రజలను కాపాడడానికి రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే శిథిలాల కింద తీవ్ర గాయాలపాలైన ఓ నాలుగేళ్ల చిన్నారి ఐడా గెజ్గిన్‌ రెస్క్యూ సిబ్బందికి కనబడింది.

ఈ నాలుగేళ్ల చిన్నారి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన రెస్క్యూ సిబ్బంది వెంటనే శిథిలాలను తొలగించి ఐడాను చాలా వెలికితీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. నిజానికి ఐడా గెజ్గిన్‌ గత 91 గంటలుగా శిధిలాల కిందనే మృత్యువు తో పోరాడింది. తీవ్ర గాయాలు అయినప్పటికీ.. ఆశలు వదిలేసుకోకుండా.. చాలా పట్టుదలతో తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సహాయం కోసం వేచి చూసింది. నాలుగేళ్ల చిన్నారి దాదాపు నాలుగు రోజులపాటు నరక యాతన పడి.. చివరికి ప్రాణంతో బయటపడడంతో అల్లాహ్ అక్బర్.. దేవుడా ఈ బిడ్డ ప్రాణాలు కాపాడారు అని అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. టర్కీ దేశ ప్రధానమంత్రి కూడా ఈ నాలుగేళ్ల చిన్నారి యొక్క సంకల్ప బలాన్ని కొనియాడారు. ఈ సంఘటనను ఒక అద్భుతం గా అభివర్ణించారు.


ఇకపోతే భూకంపం కారణంగా టర్కీ దేశంలో ఇప్పటికే వంద మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నాలుగేళ్ల చిన్నారి కుటుంబ సభ్యులు కూడా ఈ భూకంపం నుండి ప్రాణాలతో బయటపడ్డ గలిగారు. తమ బిడ్డ ప్రాణాలతో ఉందని తెలిసే వారంతా ఆనంద భాష్పాలు కార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: