ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి రోజురోజుకు ఆగమ్య గోచరం గా మారి పోయింది భారత్ లో పరిస్థితులు సృష్టించి భారత్ పై   ఆధిపత్యం సాధించి మత రాజ్య స్థాపన చేయాలని ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్ ప్రయత్నాలు ఫలించడం లేదు. కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత దారుణం గా మారి పోయాయి  అని చెప్పాలి. ఎక్కడ కూడా పాకిస్తాన్ సైన్యానికీ గాని ఉగ్రవాదులకు గాని  అవకాశం ఇవ్వడం లేదు భారత సైన్యం. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్తాన్ను మరింత సంక్షోభంలో పడేస్తూన్నాయి




 గతంలో మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ద్వారా పాకిస్తాన్ ఎంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది అన్న విషయం తెలిసినదే.  ఇప్పటికి కూడా ఆర్థిక సంక్షోభం నుంచి తేరుకోవడం లేదు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వ్యవహార శైలితో మొన్నటివరకు పాకిస్థాన్కు అవసరమైనప్పుడల్లా ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడిన దేశాలు  ప్రస్తుతం పాకిస్తాన్కు ఇచ్చిన అప్పులు చెల్లించాలంటూన్నాయి తప్ప అప్పులు ఇచ్చే ఉద్దేశం మాత్రం లేదు. ఈ నేపథ్యంలో ప్రజల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఉగ్రవాదుల మనుగడ మాత్రం కష్టమవుతుంది.


 సాధారణంగా అయితే అక్కడ ఐఎస్ఐ నుంచి ఉగ్రవాదులకు ప్రతి నెలా కొంత మొత్తం లో జీతాలు లాగానే డబ్బులు ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోవడంతో ఎలాంటి డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఉగ్రవాదుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవలే పాకిస్తాన్లో ఐఎస్ఐ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేయడం మరింత సంచలనంగా మారిపోయింది. ఐఎస్ఐ డైరెక్టర్ పై దాడి చేయడంతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం పాకిస్తాన్ దేశం మొత్తాన్ని వణికిస్తోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని  ప్రస్తుతం పాకిస్థాన్ వణికిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: