ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...హైదరాబాద్ లో ఎన్నికల హోరు స్టార్ట్ అయ్యింది. గత 15 రోజుల నుంచి చాలా రసవత్తరంగా సాఫీగా సాగిన వివిధ పార్టీల ఎన్నికల ప్రచారాలు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసాయి. ఇక
కేఏ పాల్ గతంలో
పార్టీ పెట్టి
ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.. ఇక అప్పుడు దీనిపై
కేఏ పాల్ పలు విమర్శలు కూడా ఎదుర్కోవటం జరిగింది. ఇక ఇప్పుడు జరుగుతున్న గ్రేటర్
హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై
కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ సికింద్రాబాద్‌లో జరుగుతున్న ఎన్నికల్లో మార్పు తేవాలి, మార్పు కావాలి అన్నారు కేఏ పాల్. విలువైన ఓటును అమ్ముకోవద్దన్నారు. కులాలకు మతాలకు అతీతంగా ఓటు వేయాలని గ్రేటర్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
అతి త్వరలోనే
హైదరాబాద్ వస్తున్నా అన్నారు.
తెలంగాణ, ఆంధ్రాలో గొప్ప మార్పు వస్తుందన్నారు.మరోవైపు గ్రేటర్
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. డీఆర్‌సీ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సుల పంపిణీ పూర్తైందన్నారు. డీఆర్‌సీ కేంద్రాల నుంచే స్ట్రాంగ్ రూమ్‌లు, లెక్కింపు కేంద్రాల నిర్వహణ జరగనుంది. ఎల్బీనగర్ జోన్‌లో 5,
చార్మినార్ జోన్‌లో 6 డీఆర్‌సీ కేంద్రాలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలోని 30 డీఆర్‌సీ కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు. పోలింగ్ సామాగ్రితో పాటు కరోనా కిట్లు, శానిటైజర్ల పంపిణీ జరగనుంది.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. మరెన్నో విషయాలు తెలుసుకోండి...