దానికి తోడు బీజేపీ బలపడుతుండడం కూడా ఆయనకు ఏమాత్రం నచ్చడంలేదు.. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ పార్టీ ఒక్కసారిగా ప్రధాన ప్రతిపక్షంగా తయారైంది. కాంగ్రెస్ లాంటి మేటి పార్టీ ని వెనక్కి తిరిగి చుకోకుండా చేసింది.. కేంద్రం కూడా తెలంగాణ లో పాతుకుపోవడానికి రాష్ట్ర బీజేపీ నేతలకు ఊతంగా నిలుస్తుంది.. గ్రేటర్ ప్రచారంలో బీజేపీ హేమాహేమీలు పాల్గొన్న సంగతి తెలిసిందే. వీరు కేసీఆర్ పై వ్యతిరేకత ను తేవడంలో మంచి ఫలితాలు సాధించారు. నిజానికి కేసీఆర్ పై వ్యతిరేకత తేవడంలో ప్రతిపక్షాలు ఎప్పటినుంచో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి..
అయితే ఈ వ్యతిరేకత ను తగ్గించుకోవడానికి కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముంచుకొస్తున్న వేళ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీంతో పాటు కేసీఆర్ కొత్త వరాలూ ప్రకటించారు. నల్లగొండ జిల్లా పరిధిలోని రెండు ప్రధాన ఎత్తిపోతల పథకాలతో పాటు మరికొన్ని ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.నియోజకవర్గంలోని హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఎత్తిపోతల పథకాల మంజూరుపై నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ నదిపై కేశవాపురం వద్ద కొండ్రపోల్ ఎత్తిపోతల పథకానికి రూ.75.93 కోట్లు కేటాయించారు.సిద్దిపేటలో డబుల్ ఇళ్లను ప్రారంభించిన కేసీఆర్ మరిన్ని కార్యక్రమాల కోసం అడక్కుండానే నిధులు మంజూరు చేశారు. రంగనాయకసాగర్ పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఇరుకోడు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.80 కోట్లు మంజూరు చేస్తామన్నారు. జీహెచ్ఎంసీలోనూ అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ఎల్బీనగర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు అందుబాటులోకి తెచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి