అసలే తెలంగాణ లో బలపడుతున్న బీజేపీ పార్టీ కి ఇది అనుకోవని పరిణామమే.. ఎందుకంటే కేసీఆర్ మోడీ ని ఎంత విమర్శిస్తే అంత కేసీఆర్ ని తెలంగాణ బీజేపీ నేతలు విమర్శించడం అంత వీలవుతుంది. ఇలాంటిది సడెన్ గా మోడీ ని పొగుడుతూ మాట్లాడితే తమకు ప్రాధాన్యం ప్రజలు ఇవ్వరు అన్న భావన వారిలో కలిగింది.. అయితే ఈ యూ టర్న్ తో కేసీఆర్ ఎదో చేయబోతున్నాడని మాత్రం గ్రహించగలుగుతుంది.వెతగ్గా.. వెతగ్గా.. వారికి కొనుగోలు కేంద్రాల ఎత్తివేతలో కుట్ర కనబడింది. వెంటనే ప్రెస్‌మీట్ పెట్టిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. కేసీఆర్ తీరును విమర్శించారు.
గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను పంటల కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కేంద్ర చట్టాల వల్ల.. రైతులు ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకునే వెసులుబాటు ఉంది కాబట్టి.. దాన్ని అందిపుచ్చుకోవాలని రైతులకు సూచించారు. దాంతో పాటు.. అలాచేయడం వల్ల ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చు కాబట్టి.. ఇక పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని.. గ్రామాల్లో పెట్టిన కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అసలు కేంద్ర వ్యవసాయ చట్టాలకు.. ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సంబంధంలేదు. ప్రభుత్వం కనీస మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేయవద్దని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. అయినా సరే కేసీఆర్.. ఇదే చాన్స్ అనుకుని వాటిని కూడా ఎత్తేయాలని నిర్ణయించుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి