గత కొంతకాలంగా ఏపీలో హాట్ హాట్ గా సాగుతున్న టాఫిక్ ఏదైనా ఉందా అంటే అది తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన అంశమే. దాని చుట్టూనే ఏపీ రాజకీయం అంతా నడుస్తోంది. ఒకవైపు బిజెపి, టిడిపి, వైసిపి, జనసేన ఇలా అన్ని పార్టీలు పూర్తిగా ఉప ఎన్నికపైన్ పూర్తి ఫోకస్ పెంచాయి. అందరికంటే ఎక్కువగా జనసేన , బీజేపీలు తిరుపతి ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి రాజకీయం చేస్తున్నాయి. ఇప్పటికే పవన్ తిరుపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్లమెంట్ పరిధిలోని జిల్లాల్లో పర్యటించారు. రైతు పరామర్శ పేరుతో హడావుడి చేశారు. ఇదంతా ఇలా ఉంటే, ఇప్పటికీ తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి ,జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు.
రెండు పార్టీలు సొంతంగా తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నాయి. కానీ పొత్తు వ్యవహారం ఉండడంతో ఏకాభిప్రాయానికి రావాలని చూస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా
జనసేన పార్టీ నుంచి ఓ ప్రకటన వెలువడింది.
పవన్ ఈనెల 21వ తేదీన తిరుపతిలో పర్యటించబోతున్నారని
ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ నెల 21 సాయంత్రం
తిరుపతి నగరంలో
పవన్ ఆధ్వర్యంలో
జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ సమావేశం కాబోతున్నట్లు, ఆయనతో పాటు
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్
నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారని , ఈ సమావేశంలో
తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి విషయం పైనా, నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏదిఏమైనా గతంతో పోలిస్తే
జనసేన దూకుడు మరింత పెంచే విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవహరిస్తోంది.
పవన్ సైతం
బీజేపీ తమతో కలిసినా, కలవకపోయినా తమ రూట్ కి ఏ ఇబ్బందీ లేకుండా చేసుకునేందుకు మాత్రం తగిన ప్రణాళిక వేసుకునే పనిలో ఉన్నారు.