తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నా సరే క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తప్పులు మాత్రం ఆ పార్టీని చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. రాజకీయంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడుతున్న తరుణంలో టిఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయి నేతలు చేస్తున్న తప్పులు ప్రజలను పార్టీకి దూరం చేస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులందరూ కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగానే ఉండాలి.

కానీ టిఆర్ఎస్ పార్టీలో చాలామంది నేతలు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రజలకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను అందించే విషయంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న గ్రామ స్థాయి నేతలు అలాగే జిల్లా స్థాయి నేతలు కూడా ఇప్పుడు పెద్దగా దృష్టి సాధించలేకపోతున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణలో ప్రజల్లో ఉండే నాయకులను మాత్రమే గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంది కానీ గ్రామాల్లో వర్గ విభేదాలు ఎక్కువగా ఉండటంతో చాలామందికి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల విషయంలో కూడా ఇదే జరుగుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఆసరా పింఛన్ల విషయంలో కూడా టిఆర్ఎస్ వాళ్లకు అనుకూలంగా ఉంటే మాత్రమే... కొత్తవి నమోదు చేస్తున్నారని లేకపోతే మాత్రం నమోదు చేయడం లేదని అంటున్నారు. అంతేకాకుండా గ్రామ స్థాయిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి జరుగుతుందని లేకపోతే మాత్రం జరగడం లేదని కొంతమందిలో ఆవేదన ఉంది. దీని మీద సీఎం కేసీఆర్ గనుక దృష్టిసారించి పరిస్థితి మార్చకపోతే టిఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు ఉంటాయని పలువురు హెచ్చరిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: