ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్రానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉంది అనే వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పోలీసులు విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించకపోతే మాత్రం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఉద్యమాలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ విషయంలో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు.

రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అధికార పార్టీ నేతలు మాట వింటూ... అధికార పార్టీ నేతలకు మాత్రమే సహాయసహకారాలు అందిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నేతలను మాత్రమే ఇబ్బంది పెట్టిన పోలీసులు... ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలను కూడా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడంతో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతాపార్టీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచన ఉన్నాయని అంటున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలీసుల వ్యవహార శైలిపై కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే ఆయన పార్టీ రాష్ట్ర నేతలతో కూడా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. పోలీసుల వైఖరి కారణంగా రాష్ట్రంలో విపక్షాలు మాట్లాడాలి అంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని దీంతో ఇప్పుడు సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వాస్తవ పరిస్థితిని వివరించే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఆయన త్వరలోనే పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి బిజెపి చేస్తున్న రథయాత్రను కూడా పోలీసులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: