జగన్ కుటుంబంలో చిచ్చు రేగిందట.. అంతర్గతంగా నిప్పు రాజుకుంటోందట.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి, ఆయన సోదరి వైఎస్‌ షర్మిలకు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయాట ? ఇద్దరి మధ్యా మాటలు కూడా కరువయ్యాయట ? అన్న – చెల్లెలి మధ్య ప్రారంభమైన పోరులో తల్లి, దివంగత రాజశేఖర్‌ రెడ్డి భార్య శ్రీమతి విజయలక్ష్మి కూతురుకే అండగా నిలవాలనుకుంటున్నారట..  జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తమను నిర్లక్ష్యం చేస్తున్నారని తల్లీ కూతుళ్లు బాధపడుతున్నారట..

అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీని చేస్తానని లేదా తెలంగాణలో పార్టీ పెట్టించి ముఖ్యమంత్రిని చేస్తానని చెల్లి షర్మిలకు జగన్‌ హామీ ఇచ్చారట.. అన్న జైలుకు వెళ్లినప్పుడు దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి, జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న  షర్మిల ఇప్పుడు జగన్  నిర్లక్ష్యం చేస్తున్నారట. అలా అని షర్మిల ఆవేదన చెందుతున్నారట .. అంతే కాదు.. కన్నకూతురు నిరాదరణకు గురవడాన్ని శ్రీమతి విజయలక్ష్మి జీర్ణించుకోలేకపోతున్నారట.. తాము ఆశించిన రాజన్న రాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో కనిపించడంలేదని, తమిళనాడు తరహా రాజకీయాలను తీసుకువచ్చారని జగన్‌ రెడ్డిపై వారిద్దరూ ఆగ్రహంగా ఉన్నారట..?

రాజకీయాలలో ఎదగనీయకుండా..  తండ్రి హయాంలో ప్రారంభించిన వ్యాపారాలలో కూడా తన పాత్ర లేకుండా చేసినందుకు అన్నపై షర్మిల మండిపడుతున్నారట...  తాను ఏమిటో రుజువు చేసుకోవడానికై తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించాలని షర్మిల నిర్ణయించుకున్నారట... ఇవన్నీ ఎవరు చెబుతున్నారంటారా... ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ప్రతి ఆదివారం రాసే కొత్త పలుకులో ఈ విషయం బయటపెట్టారు. ఆయన ఏపీ సీఎంకు యాంటీ అన్న సంగతి తెలిసిందే. అయినా సరే.. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అంత ధైర్యంగా రాశారంటే అందులో విషయం ఉండకుండా పోదు. అందులోనూ రాజకీయాల విషయంలో కాస్త అటూ ఇటూగా  రాయొచ్చేమో కానీ.. జగన్ ఫ్యామిలీ మ్యాటర్‌ను కూడా గట్టిగా రాశాడంటే.. విషయం ఏదీ తీవ్రంగా ఉన్నట్టే లెక్క.. 

మరింత సమాచారం తెలుసుకోండి: