పంచాయితీ
రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ,
గోపాలకృష్ణ ద్వివేదీ మీడియా సమావేశం నిర్వహించారు. రెండవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం చేసామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. 3,328 సర్పంచ్ లకు గాను ఇప్పటికే 539 ఏకగ్రీవాలు అయ్యాయి అని తెలిపారు. 33,570 వార్డు స్ధానాలకు గాను 12,604 ఏకగ్రీవాలు జరిగాయని అన్నారు. 2,789 సర్పంచ్ స్ధానాలకు 2,786 స్ధానాలకు 7,507 మంది అభ్యర్ధులు పోటి చేస్తున్నారని ఆయన వివరించారు.
20,966 వార్డు స్ధానాలకు 149 స్ధానాలలో నో నామినేషన్ అని ఆయన తెలిపారు. 20,817 వార్డులకు 44,876 అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు అని వివరించారు. 29,304 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేసారు అని తెలిపారు. 5,480 సెన్సిటివ్, 4,181 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు గుర్తించామని అన్నారు. స్టేజ్ 1 ఆర్ వో లుగా 1292 మంది, స్టేజ్ 2 ఆర్ వో లుగా 3,427, ఏఆర్ వో లుగా 1370 , పివో లుగా 33835, ఇతర పోలింగ్ సిబ్బంది 47,492. మందిని నియమించామని అన్నారు.
జోనల్ అధికారులు 551, రూట్ అధికారులుగా 1228, అబ్జర్వర్లు 2606 ఏర్పాటు చేసామని ఆయన వివరించారు. 167 బ్యాలెట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, 5కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరానికి 2440, 5 కిలో మీటర్ల కంటే తక్కువ దూరానికి 1281 వాహనాల ఏర్పాటు చేసామని ఆయన అన్నారు. కౌంటింగ్ సిబ్బందిగా 16788 సూపర్వైజర్లు, 32141 ఇతర సిబ్బంది సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎలక్షన్ల ప్రక్రియను ఉదయం నుంచీ వెబ్ కాస్టింగ్ ద్వారా పంచాయితీ
రాజ్ కమీషనర్, ఎస్ఈసీ, ఇతర
జిల్లా అధికారులు పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 3:30 కు పోలింగ్ ముగుస్తుంది. మధ్యాహ్నం 1:30 కు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ జరిగిన వెంటనే కౌంటింగ్, విజేతల ప్రకటన ఉంటుంది.