కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం రైతులకు చేయూత అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతులందరికీ చేయూత అందించే విధంగా పీఎం కిసాన్ యోజన అనే సరి కొత్త స్కీమ్ తెరమీదికి తెచ్చింది. ఇక ఈ పథకంలో భాగంగా ప్రతిఏటా రైతులు ఖాతాలలో ఆరువేల రూపాయలు జమ చేసేందుకు నిర్ణయించింది. అయితే ఒకేసారి కాకుండా మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో ఆరువేల రూపాయలు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న రైతులు అందరు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ ద్వారా లబ్ది పొందుతున్నారు.


 అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంఏడు  విడుతల  డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది.  ఇక వచ్చే నెలలో 8 వ విడత డబ్బులు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.  ఈ క్రమంలోనే ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం కిసాన్ పథకం ద్వారా ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే పీఎం కిసాన్ పథకం ద్వారా కేవలం 6 వేల రూపాయలు పొందడమే కాదు మరో మూడు బెనిఫిట్స్ ఉన్నాయి అని మాత్రం చాలామందికి తెలియదు. పీఎం కిసాన్ స్కీమ్ లో ఉన్న రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులు ఎంతో సులభంగా పొందేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా చౌక  వడ్డీకే మూడు లక్షల రుణం లభిస్తుంది.



 పీఎం కిసాన్ పథకం లో లబ్ధిదారులుగా  ఉన్న రైతులు అందరు కూడా సులభంగా కిసాన్  మాన్  ధన్  యోజన  స్కీమ్  లో చేరవచ్చు. దీని కోసం కేవలం ఆరు వేల నుంచి నెలవారి డబ్బులు కట్టేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కిసాన్ స్కీమ్ లో చేరిన రైతుల అందరికీ కూడా ఫార్మర్ ఐడి ఇవ్వాలని యోచిస్తోంది.  ప్రత్యేకమైన కార్డులతో  రైతుల భూములను లింకు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  దీంతో ప్రభుత్వం తీసుకు వచ్చే అన్ని రకాల స్కీమ్స్ తో రైతులకు నేరుగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: