చమురుపై ఉన్న పన్నులు తగ్గించాలని యోచిస్తోంది కేంద్రం. వినియోగదారులపై పన్ను భారం తగ్గించాలని భావిస్తుంది. దేశంలో ఇటీవల చమురు ధరలు ఆకాశాన్నంటాయి. మునుపెన్నడూ లేనివిధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆల్‌టైం గరిష్ఠాలను తాకాయి. దీంతో దేశంలో ఇంధన ధరలను అదుపులోకి తెచ్చి సామాన్యులకు కాస్త ఊరట కలిగించాలని భావిస్తోంది కేంద్రం. ఎక్సైజ్‌ సుంకం తగ్గించే యోచనలో ఉంది.మార్చి రెండోవారం నాటి నుంచి సుంకాల తగ్గింపు లేదా ధరల స్థిరీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ప్రజలు చెల్లిస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలలో కేంద్ర రాష్ట్రాల పన్నుల వాట దాదాపు  60 శాతం దాకా ఉంది. ప్రపంచంలో పెట్రో ఉత్పత్తుల వాడకంలో  భారతదేశం మూడో అగ్రదేశం. రాష్ట్రాలకు లిక్కర్ తర్వాత బాగా రెవిన్యూ సమకూర్చేది పెట్రోలు డీజిల్ పన్నులే కాబట్టి, సుంకాన్ని తగ్గించేందుకు రాష్ట్రాలు ఇంతవరకు సుముఖంగా లేవు. అయితే,ఇపుడు కేంద్రం రాష్ట్రాలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తోంది.

చమురు ఉత్పత్తి చేసే ఓపెక్‌ దేశాలతో భారత్‌ త్వరలో సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత పన్ను తగ్గింపుపై నిర్ణయానికి వచ్చే అవకాశముంది. ముడి చమురు ఉత్పత్తిని పెంచి ధరలు తగ్గేలా చూడాలని ఓపెక్‌ దేశాలను ఇప్పటికే భారత్‌ కోరింది. కరోనా  సమయంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని, ప్రజల ఆదాయాలు తగ్గినా  కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రెండు సార్లు పెట్రోలు, డీజిల్ మీద పన్నులు పెంచింది.నిజానికి ముడి చమురు ధర భారీగా పతనమయినపుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందించకుండా మోడీ ప్రభుత్వం పన్నులు పెంచి వీటి ధర ఎపుడూ అధికంగా ఉండేలా చేసింది. ఇపుడు కీలకమయిన రాష్ట్రాలలో,అందునా బీజేపీ బలహీనంగా ఉన్న కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగబోతున్నందున పెట్రోలు, డీజిల్ ధరల భారత తగ్గించేందుకు పన్నుల మీద కోత విధించాలని  కేంద్ర ఆర్థి శాఖరాష్ట్రాలను సంప్రదిస్తున్నది. ఈ చర్చలు మార్చి మధ్య కల్లా ఒక కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: