ఏపీ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కార్పొరేషన్ విశాఖపట్నం. కొత్త రాజధాని విశాఖపట్నం లో పాగా వేయాలని అటు అధికార వైసీపీతో పాటు ఇటు విప‌క్షం తెలుగుదేశం పార్టీలు కసితో ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బాధ్యతను అదే జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు ... ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి పై పెట్టారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలు మంత్రి అవంతికి కీలకంగా మారాయి.

త‌న కుమార్తెను సైతం అవంతి శ్రీనివాస్‌ కార్పొరేట‌ర్‌గా పోటీ చేయిస్తున్నారు. డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విపై క‌న్నేసి ఆయ‌న త‌న కుమార్తెను కార్పొరేట‌ర్‌గా పోటీ చేయిస్తున్నారు. న‌గ‌రంలో ఆరో డివిజ‌న్ నుంచి అవంతి కుమార్తె డాక్టర్ ల‌క్ష్మీ ప్రియాంక కార్పొరేట‌ర్ అయితే డిప్యూటీ మేయ‌ర్ అయినా త‌న కుమార్తెకు ఇప్పించుకోవాల‌న్న‌దే అవంతి ప్లాన్‌. మేయ‌ర్ బీసీల‌కు రిజ‌ర్వ్ కాగా.... న‌గ‌ర వైసీపీ అధ్య‌క్షుడు బొమ్మ‌న‌బోయిన వంశీ కృష్ణ యాద‌వ్ పేరు బ‌లంగా వినిపిస్తోంది. అందుకే అవంతి కుమార్తెను డిప్యూటీ మేయ‌ర్ చేసేందుకే కార్పొరేట‌ర్‌గా నిల‌బెట్టార‌ని అంటున్నారు.

అయితే అవంతి ముందు రెండు అగ్ని ప‌రీక్ష‌లు ఉన్నాయి. ఒక‌టి కుమార్తె కార్పొరేట‌ర్ గా గెల‌వాలి. ఇక్క‌డ జ‌నసేన బ‌లంగా ఉంది. పైగా టీడీపీ జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టుల‌తో పొత్తు పెట్టుకుంది. వైజాగ్ ఉక్కు ఉద్య‌మం వైసీపీకి త‌ల‌నొప్పిగా మారింది. ఈ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొని ఇక్క‌డ పార్టీని గెలిపించ‌డంతో పాటు అవంతి కుమార్తె కూడా గెలిస్తే రేపు డిప్యూటీ మేయ‌ర్ ఛాన్స్ ఉంటుంది. మ‌రి అవంతి శ్రీనివాస్‌ ఈ విష‌యంలో ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో ? చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: