ఇక అసలు విషయానికి వస్తే కొంతమంది పబ్లిషర్స్ ల టాపిక్ ని న్యూస్ లని ఈ ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు వారి అనుమతులు లేకుండా పబ్లిష్ చేసుకుంటున్నారట. ఇందువల్ల ఆ పబ్లిషర్స్ నష్టపోతున్నారు. గతంలో వారు ఆస్ట్రేలియా లో ఇలాంటి విషయం జరిగినప్పుడు వారు ఫిర్యాదు చెయ్యడం జరిగింది. ఇప్పుడు కూడా న్యూజిలాండ్ లో ఇలా రిపీట్ అయినందుకు న్యూజిలాండ్ ఫిర్యాదు చేశారంట పబ్లిషర్స్. యు ట్యూబ్ వాళ్ళ లాగానే వీరు కూడా తమ న్యూస్ వాడుకొని సంపాదించుకుంటున్నందుకు తమకు పరిహారం చెల్లించాలని తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారట.దీంతో ఇప్పటిదాకా ఈ ఫేస్ బుక్, గూగుల్ వారికి సంపాదించుకోవడంతో పాటు ఇప్పుడు ఖర్చు పెట్టడం కూడా తెలిసినట్లు స్పష్టం అవుతుంది...కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఈ సైట్స్ ముందుకు వెళ్ళాలి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి