ఓ వైపు చూస్తే ఏపీలో ఎటు చూసినా కరోనా కోరలు చాచి ఉంది. సెకండ్ వేవ్ దూకుడుగా సాగుతోంది. ఏపీలో రోజుకు దగ్గర దగ్గర పాతిక వేల దాకా కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు సెంచరీని దాటుతున్నాయి. కరోనా మే నెలలో విశ్వరూపమే చూపిస్తుంది అని వైద్య పరిశోధకులు అంటున్నారు.

ఈ విషమ పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం మంచిదేనా అన్న చర్చ అయితే ఒక వైపు సాగుతోంది. సరే అసెంబ్లీ సమావేశాలు ఒక రోజు నిర్వహిస్తారా రెండు మూడు రోజులా అన్నది పక్కన పెడితే అసలు అసెంబ్లీ ఒక్క రోజు జరిగినా కూడా ఈ టైమ్ లో మంచిది కాదేమో అన్న మాట ఉంది. శాసనసభను పిలిస్తే  ఉభయ సభలు సమావేశం అవుతాయి. దాదాపుగా రెండు వందల ముప్పై మంది సభ్యులు జమ  అవుతారు. ఇక అధికారులు అన్ని విభాగాల నుంచి హాజరు కావాలి. పోలీస్ బందోబస్తుతో పాటుగా  ఇలా చాలా హంగామా ఉంటుంది.

దీంతో కరోనా కట్టడికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది కొంత ఇటు వైపుగా  డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. మరో వైపు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా పొరపాటున ఎవరికైనా సోకితే అది మరింత ప్రమాదం అవుతుంది. నిజమే బడ్జెట్ సమావేశాలు చాలా ప్రాధాన్యతతతో కూడుకున్నవే కానీ ఇపుడున్న కరోనా వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్నాళ్ళు వాయిదా వేసినా తప్పు లేదు. ఓటాన్  అకౌంట్ బడ్జెట్ ఆమోదించుకునే వెసులుబాటు ఎటూ ఉంది. కొత్తగా  ఆర్డినెన్స్ వీలైతే తీసుకురావచ్చు.

కానీ కరోనా పీక్స్ లో ఉన్న టైమ్ లో అసెంబ్లీని పిలవడం అది కూడా బడ్జెట్ పద్దుల కోసమే అని చెబుతున్నా కూడా ఇపుడు మంచిది కాదేమో అన్న చర్చ అంతటా ఉంది. మరి ఈ బడ్జెట్ సమావేశాలకు ఎంత మంది హాజరవుతారు, ఎలా జరుగుతుంది అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా వాయిదా వేసుకుంటే మంచిది అన్న సూచనలు అయితే వెలువడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: