ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి ప్రపంచమంతా తెలిసే ఉంటుంది. ఇందుకు కారణం కిమ్ తీసుకునే వివాదాస్పద మరియు భయంకరమైన నిర్ణయాలే కారణం. ఒక విచిత్రమైన పాలనాపరమైన తీరుతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అదే విధంగా ఇప్పుడు మరొక విషయంపై కిమ్ వార్తల్లో నిలిచారు. కానీ ఈసారి తన వ్యక్తిగత విషయమై వార్తల్లో నిలవడం విశేషం. ఇంతకీ విషయం ఏమిటంటే, తాజాగా విడుదలైన కిమ్ జాంగ్ ఫోటోలు ఇతని ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఫోటోలలో కిమ్ ఎలా ఉన్నాడంటే, చాలా సన్నగా ఉన్నాడు. దీనిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కిమ్ జాంగ్ చాలా కాలం తరువాత మొన్ననే మళ్ళీ యధావిధిగా తన పనుల నిమిత్తం బయటకు వచ్చాడు. ఇలా కనబడిన కిమ్ జాంగ్ ఫోటోలు తీసి ఆన్లైన్ లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు వీటిని వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలోని తన రూపం ఇంతకు ముందు కన్నా చాలా సన్నగా ఉండడంతో ఈయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదేమోనని ఎవరికి వారు ఊహించుకుంటున్నారు.
కిమ్ జాంగ్ అంతకుముందు కొంతకాలం అనారోగ్య కారణంగా బయటకు రాలేదనే విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో కిమ్ చనిపోయాడని వార్తలొచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయిన ఫోటోలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అంత తక్కువ సమయంలో అంతలా బరువు తగ్గడానికి కారణమేంటని పలువురు తలలు పీక్కుంటున్నారు. ఈ ఫోటోలపై జోరుగా చర్చ జరుగుతోంది. కెసిఎన్ఎ వార్తా పత్రిక ఒక ప్రకటనలో ఉత్తర కొరియా నాయకుడు కిమ్ తో ఒక నెల క్రితం పొలిట్ బ్యూరో మీటింగ్ లో పాల్గొన్న ఫోటోలను షేర్ చేసింది. అంతే కాకుండా సియోల్ కు చెందిన వెబ్ సైట్ డైలీ ఎన్ కె కిమ్ యొక్క తాజా ఫోటోలను ఇంతకు ముందు ఉన్న ఫొటోలతో పోల్చి చూపించడానికి ప్రయత్నం చేసింది. వీరు పోల్చిన ఫోటోలలో వివిధ సమయాలకు సంబంధించినవి ఉన్నాయి. వాటిలో 2020 నవంబర్ నుండి ఏప్రిల్ 2021 జూన్ వరకు ఉన్న పలు రకాల ఫోటోలను కంపేర్ చేసింది. ఈ ఫోటోలలో ఒక దానిలో 37 సంవత్సరాలున్న కిమ్ జాంగ్ ఐడబ్ల్యుసి షాఫ్హౌసెన్ పోర్టోఫినో వాచ్ ను పెట్టుకుని ఉన్నాడు. ఇది కిమ్ జాంగ్ యొక్క ఫేవరెట్ వాచ్ అని తెలుస్తోంది.
దీని విలువ 12000 డాలర్లని అంచనా. అప్పటి నవంబర్ 2020 లో తీసిన ఫొటోతో, 2021 మార్చి లో తీసిన ఫోటోను తీక్షణంగా గమనిస్తే కిమ్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ బాగా సన్నబడినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఫోటోలలో మార్పులు గమనించిన తరువాత కిమ్ అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కిమ్ కుటుంబంలో ఎక్కువగా గుండె జబ్బులతో బాధపడుతున్న చరిత్ర కలిగి ఉన్నారు. కాబట్టి కిమ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారేమో అన్న సందేహాన్ని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కిమ్ బరువును పరిశీలిస్తే గతేడాది నవంబర్ లో 140 కిలోలు ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే 2011 లో అధికారాన్ని పొందినప్పటి నుండి దాదాపుగా 50 కిలోల బరువు పెరిగినట్లు ఎన్ఐఎస్ వారు సౌత్ కొరియా మెంబర్స్ తో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవంగా కిమ్ జాంగ్ విషయంలో ఏమి జరిగింది అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: