ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూముల సమగ్ర
సర్వే ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం
ఏపీ సర్కారు స్టీరింగ్ కమిటీ ని ఏర్పాటు చేస్తూ గురువారం రోజు ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు నేతృత్వంలో ఈ రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ పని చేయనుండగా.. ఈ మేరకు
ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్టీరింగ్ కమిటీ కి వైస్ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరించనున్నారు.
ఇక ఈ కమిటీలో.. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ), రెవెన్యూ, ఆర్థిక, పురపాలన, పంచాయతీరాజ్, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శులు,
సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్, గనుల శాఖ డైరెక్టర్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. అయితే రాష్ట్ర స్థాయి తో పాటు
జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీకి కూడా చైర్మన్ ని నియమిస్తూ
ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. కలెక్టర్‌ల సారథ్యంలో
జిల్లా స్థాయి ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీ పని చేయనుంది.
ఐతే రీ
సర్వే ప్రాజెక్టు అమలు సక్రమంగా జరిగేలా స్టీరింగ్ కమిటీ తరచూ సమావేశమై పురోగతిపై రివ్యూ చేపట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్టీరింగ్ కమిటీ ప్రాజెక్టు పరిధిలో చేపట్టే పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే తాజాగా
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల పరిధి మేరకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ రీ
సర్వే ప్రాజెక్ట్ ని విజయవంతంగా అమలు చేయాలి. ఈ స్టీరింగ్ కమిటీ రీ
సర్వే సక్సెస్ అయ్యేందుకు దోహదపడాలి, అలాగే ఈ ప్రాజెక్టు యొక్క ఫలితాలు ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియజేసేందుకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. కలెక్టర్ సారథ్యంలో ఏర్పాటైన
జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పరిశీలనలు చేయాల్సి ఉంటుంది.
ఇక గతంలో పైలట్ ప్రాజెక్టు పేరిట పల్లెటూర్లలో చేపట్టిన రీసర్వే దాదాపు పూర్తి కావస్తోంది. మొదటి దశలో 4,800 గ్రామాల్లో రీసర్వే చేపట్టిన విషయం తెలిసిందే.