చంద్రబాబు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి సీఎం జగన్‌పై ఏ రకంగా ఫైర్ అవుతున్నారో అందరికీ తెలిసిందే. నిత్యం ఏదొక అంశంపై బాబు, జగన్‌ని విమర్శిస్తున్నారు. అలాగే తమ నేతలపై కేసులు పెట్టి హింసిస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహ తిరిగి చెల్లిస్తామని పదే పదే చెబుతున్నారు. అలాగే అప్పుడు తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే కేసులు పెట్టి ఉంటే ఒక్క వైసీపీ నేత కూడా రోడ్డుపైకి వచ్చేవారు కాదని మాట్లాడుతున్నారు.


అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కాస్త కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, గతంలో తమని ఇబ్బంది పెట్టిన టీడీపీ నేతల టార్గెట్‌గా రాజకీయం చేస్తుందని, ఆ విషయం అందరికీ కనిపిస్తుందని, కాకపోతే గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా చేసిన పని ఏంటి అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం కరెక్ట్ కాదని, అదే సమయంలో గతంలో చంద్రబాబు అదే తప్పు చేశారని అంటున్నారు.


రాక రాక పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, ఆ ఐదేళ్లలో వైసీపీ నేతలకు చుక్కలు చూపించారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ ప్రభుత్వంపై గానీ, టీడీపీ నేతలపైన గానీ ఏమన్నా కామెంట్స్ చేస్తే చాలు వారిపై కేసులు పెట్టి జైలుకు తీసుకెళ్లారని, పలువురు వైసీపీ, జనసేన కార్యకర్తలు జైలు పాలయ్యారని గుర్తు చేస్తున్నారు. అలాగే పలువురు వైసీపీ నేతలపై కేసులు పెట్టించారని, ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలని బెదిరించి టీడీపీలో చేర్పించుకున్నారని చెబుతున్నారు.


అలాగే జగన్ కేసులు గురించి, 16 నెలలు జైలుకెళ్లడం గురించి పదే పదే మాట్లాడి అవమానించారని, ఇంకా జగన్‌ని పలు సందర్భాల్లో అడ్డుకుని, ఆయనపైనే కేసులు పెట్టారని గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఆ రేంజ్‌లో జరగడం వల్లే, ఈ రోజు వైసీపీ ప్రభుత్వం, టీడీపీ నేతలపై కక్ష సాధిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఏదేమైనా రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు మంచిది కాదని చెబుతున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: