తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి.  గత ఏడున్నర సంవత్సరాల నుంచి తిరుగులేకుండా టిఆర్ఎస్ పార్టీ మిగతా అన్ని పార్టీలను కట్టి పెట్టింది. ప్రస్తుతం  కాంగ్రెస్ పార్టీకి టిపిసిసిగా రేవంత్ రెడ్డి రావడంతో అందులో నూతనోత్సాహం నెలకొంది. షర్మిల పార్టీ ఎంట్రీతో రాజకీయాలన్నీ  కొత్త సమీకరణాలతో ముందు పోతున్నాయి. అయితే షర్మిలకు అంత సీన్ లేదని కాంగ్రెస్ నాయకురాలు ఖమ్మం ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి అన్నారు. షర్మిల వెనకాల ఎవరున్నారు అనేది అందరికీ తెలుసని ఆమె అన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ కాకుండా ఇంకా పలు పార్టీలు కూడా రావచ్చని, ఎన్ని వచ్చినా ఎవరు ఏంటి అనేది ప్రజలు గుర్తిస్తారని అన్నారు. కాంగ్రెస్ లోకి రేవంత్ వచ్చిన తర్వాత చాలా కదలిక అనేది వచ్చిందని, రేవంత్ దాన్ని నిలబెట్టుకుంటారు అనే నమ్మకం నాకు ఉన్నదని, భవిష్యత్తులో కూడా రేవంత్ ఇలాగే ఉంటే ఇతర పార్టీల నుంచి నేతలు కూడా , వాపస్ వచ్చే అవకాశం ఉందని అన్నారు.

 షర్మిల పార్టీ కాంగ్రెస్ వాళ్లను దెబ్బతీస్తుంది అనేది భ్రమ అని, ఆమె తెలిపారు. షర్మిల పార్టీతో ఓటు బ్యాంకు లో చీలిక తీసుకువచ్చి తెలంగాణలో అరంగేట్రం చేయాలని చూస్తున్నారని, రాజశేఖర్ రెడ్డి పేరు వాడుకొని ఆయన సానుభూతిని ఓటు బ్యాంకుగా మలచుకొవాలని షర్మిల చూస్తున్నారని, అదంతా  తప్పని ప్రజలెవరూ పిచ్చివాళ్లు కాదని, వారసులను నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు. ఆమెకు  ప్రజలకు సేవ చేయాలనే భావం ఉంటే   ఉంటే, అర్జెంటుగా అమరావతి వెళ్లిపోయి అక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయండని, వాళ్లు ఎన్నో రోజులుగా ధర్నా చేస్తున్నారని  ఆ సమస్య పరిష్కారం చేయండి అన్నారు.  మీరు రాజశేఖర్రెడ్డి గారి అమ్మాయి అయితే  అక్కడ పాలించేది రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి అని మీరిద్దరూ అన్నా చెల్లెలు కలిసి అమరావతికి వెళ్లి ముందుగా సమస్య పరిష్కారం చేయండి అని  ఆరోపించారు. మీరు ముందుగా ఆ సమస్య పరిష్కారం చేస్తే, ఇక్కడి ప్రజలకు కూడా మీ మీద నమ్మకం కుదురుతుంది అని, అక్కడ ఏమీ చేయకుండా కేవలం రాజకీయ అవకాశం కోసం మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారని ఆమె అన్నారు.

 తెలంగాణలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి వారసులేనని, ఇన్ని రోజుల నుంచి గుర్తుకురాని రాజశేఖర్ రెడ్డి  పార్టీ పెట్టినప్పటి నుంచి ఎందుకు గుర్తు వస్తున్నారని, ఆయన మృతి చెందినప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి, జయంతి సభలు నిర్వహించుకుంటూ వస్తున్నారని, అప్పటి నుంచి మీరు ఏం చేస్తున్నారు అని, ముందు ఆంధ్రాలో ప్రజలకు సేవ చేసి తెలంగాణలో సేవ చేయండి అని, అక్కడ ఏమి చేయకుండా  ఇక్కడ డ్రామాలు చేస్తే ఇక్కడి ప్రజలు గమనిస్తున్నారని తెలంగాణలో నీకు అంత సీను లేదని ఆమె మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: