ఓ వైపు ప్రపంచం గత రెండేళ్లుగా కరోనాతో యుద్ధం చేస్తుంటే అది చాలదన్నట్టు కొత్త రకం వైరస్ లు పుట్టుకొచ్చి ప్రపంచ దేశాలను మరింత భయాందోళనలకు గురి చేస్తున్నాయి. కరోనా రెండోవ దశ కాస్త తగ్గింది.. హమ్మయ్య అనుకునేలోపే గత కొద్ది రోజులుగా మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతూ టెన్షన్ పెట్టిస్తుంటే వీటితో పాటుగా కొత్త వైరస్ లు బయటపడి మానవాళికి సవాలు విసురుతున్నాయి. ఆఫ్రికాలోని గినియా దేశంలో కొత్త రకం వైరస్ ఒకటి పుట్టుకొచ్చింది. మార్బర్గ్ వైరస్ (marburg virus) కు సంబంధించిన ఒక కేసును  గుర్తించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఇది చాలా ప్రమాదకరమైన వైరస్ అట...ఇది సోకిన వారిలో 88 శాతం వరకు మరణించే అవకాశం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ వైరస్ ప్రపంచ దేశాలకు సోకకుండా ప్రారంభ దశలోనే దీన్ని పూర్తిగా నియంత్రించాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఈ వైరస్ చాలా సులభంగా వ్యాప్తి చెందుతుందట టచ్ చేయడం ద్వారా ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి సోకుతుందట. ఈ వైరస్ ఉన్న వారిలో తీవ్రమైన జ్వరం, భరించలేని తలనొప్పి, చికాకు వంటివి లక్షణాలుగా ఉంటాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా చైనా లో మరో కొత్త ఫంగస్ వేరియంట్ బయటపడింది. దాన్ని ఆంత్రాక్స్ నిమోనియా అని చెబుతున్నారు. చెంగ్డే సిటీలో ఒక వ్యక్తికి ఈ వింత ఫంగస్ వేరియంట్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతన్ని క్వారంటైన్ లో ఉంచి చికిత్స ను అందిస్తున్నారు. కరోనా ఏమని ఈ ప్రపంచంలో కాలు మోపిందో గాని  అప్పటి నుండి ఈ కొత్త వైరస్ ల బెడద తప్పడం లేదు...అసలు మానవాళి మనుగడకే ఇవి సవాల్ గా మారుతున్నాయి. అసలు ఈ కొత్త రకం వైరస్ ఉత్పన్నం కావడానికి కారణాలు ఏమిటని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. 

ఇవి ఎలా మొదలయ్యాయి ఇవి సహజంగా వ్యాప్తి చెందాయా లేక కృత్రిమంగా ఎవరైనా వీటిని ప్రయోగించారా అన్న అనుమానాలు కలుగుతున్న నేపథ్యంలో వీటిపై పరిశోధన మొదలైనట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ పుట్టుకపై దీన్ని కావాలనే వుహన్ నగరంలో తయారు చేశారు అన్న అనుమానాలకు తోడు ఇప్పుడు ఈ కొత్త వైరస్  లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇందులో ఎటువంటి వాస్తవాలు బయటపడతాయో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రజలంతా పరిశుభ్రత మరియు ఇప్పుడు అనుసరిస్తున్న అన్ని జాగ్రత్తలను పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: