ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు అనేది సర్వసాధారణం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా నిశ్చలంగా జీవితాన్ని గడిపినప్పుడే జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు.  కాని నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మాత్రం అటు సభ్య సమాజంలో బ్రతుకుతున్న మనుషుల్లో రోజురోజుకు ధైర్యం అనేది కనుమరుగవుతుంది అన్నది అర్థమవుతోంది.  ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడకుండా ఏకంగా చిన్న చిన్న సమస్యలకే భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేకాదు చిన్న సమస్యలతోనే ఇక  జీవితం వృధా అనుకుని భావించి బలవంతంగా ప్రాణాలను సైతం తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్.



 ఇలా రోజురోజుకు ఎంతో మంది చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కోకొల్లలు గా వెలుగులోకి వస్తున్నాయి. టీచర్ తిట్టిందని.. తల్లిదండ్రులు మందలించారని.. ప్రేయసితో గొడవ జరిగిందని లేక ఇక పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని.. ఇలా చిన్నచిన్న కారణాలతో ఎంతోమంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  ఏకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి వంతెన పై నుండి ఓ యువకుడు నదిలో దూకడం సంచలనంగా మారింది.



 ముందుగా ద్విచక్ర వాహనం తో గోదావరి నది వంతెన పైకి వచ్చాడు ఓ యువకుడు. ఈ క్రమంలోనే ఇక వంతెన మధ్యలో తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఇక కాసేపు గోదావరి నదిని చూస్తున్నట్లుగా నిలబడ్డాడు. ఇక అంతలోనే ఏకంగా వంతెనపై నుంచి గోదావరి నదిలో దూకేసాడు   అయితే తోటి ప్రయాణికులను అప్రమత్తం అయ్యేలోపు చివరికి నదీ ప్రవాహంలో మునిగి పోయాడు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇక అక్కడ ఉన్నది వాహనం నెంబర్ ఆధారంగా నదిలో దూకిన వ్యక్తి బూర్గంపాడు మండలం పినపాక వాసి ఉపేందర్ గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: