ప్రస్తుతం ఎప్పుడు ఏం జరుగుతుందో అనే వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాహనం తీసుకొని రోడ్డు పైకి రావాలంటే భయపడి పోతున్నారు జనాలు.  మొన్నటికి మొన్న ఏకంగా ఒక్క చలానా ఉన్న బండి సీజ్ చేయొచ్చు అంటూ ఒక ట్రాఫిక్ పోలీస్ చెప్పడం ఏకంగా ఒక న్యాయవాది వాహనాన్ని సీజ్ చేయడం సంచలనం గానే మారిపోయింది ఇక దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.  ఈ వార్త చదివిన వాహనదారులు అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు అని చెప్పాలి.  దీంతో చాలామంది పెండింగ్లో ఉన్న చాలాన్లు  క్లియర్ చేసుకున్నారు.



 మరికొంతమంది ఇక వాహనంపై చలానా ఉంటే వాహనం తీసుకొని రోడ్డు పైకి రావడానికి భయపడిపోతున్నారు. కానీ ఇటీవలే వాహనదారులు అందరికీ ఊరటనిచ్చే తీర్పు వెలువరించింది హైకోర్టు. కూకట్పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న నీఖిలేష్ ఆగస్టు 1వ తేదీన బైక్ ఫై వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఆపి ఇక 1635 రూపాయలు చలానా వేశారు. వెంటనే దాన్ని చెల్లించాలి అంటూ కోరారు. అయితే దీనికి ఆ న్యాయవాది మాత్రం నిరాకరించాడు. దీంతో ఏకంగా పోలీసులు అతని వాహనాన్ని సీజ్ చేశారు. ఒక్క చలానా కే అలా ఎలా సీజ్ చేస్తారు అంటూ న్యాయవాదది పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం వినలేదు . దీంతో చిర్రెత్తి పోయిన ఆ న్యాయవాది హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.



 ఏకంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. చట్ట ప్రకారం వాహనం సీజ్ చేయకూడదు అంటూ స్పష్టం చేసింది. వెంటనే ఆ న్యాయవాదికి వాహనం తిరిగి ఇవ్వాలి అంటూ ఆదేశించింది. దీంతో పోలీసులు చేసేదేమీ లేక ఆ న్యాయవాది వాహనాన్ని మళ్లీ తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే హైకోర్టు తీర్పు ఎంతో మంది వాహనదారులకూ  ఊరటనిచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక హైకోర్టు తీర్పుతో వాహనదారులు కాస్త ధైర్యంగా వాహనం తీసుకొని రోడ్లపైకి రాగలుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: