మహిళలకు రక్షణ కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం దిశ అనే ప్రత్యేక చట్టాన్ని తీసుకు వచ్చింది. ఇక ఈ ప్రత్యేక చట్టం ద్వారా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి సత్వరంగా శిక్షించాలి అని భావించింది. అయితే ఇక దిశ చట్టాన్ని మరింతగా మహిళలకు చేరువ చేసేందుకు మహిళలకి ఎంతో పకడ్బందీగా రక్షణ కల్పించేందుకు దిశ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఒక్క బటన్ నొక్కితే చాలు అటు మహిళలు ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకొని పోలీసులు కేవలం నిమిషాల వ్యవధిలోనే మహిళలకు రక్షణ కల్పిస్తున్న ఘటనలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి.



 ఇలా మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశ అనే ప్రత్యేకమైన యాప్ తీసుకు రావడమే కాదు టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచింది ఏపీ పోలీస్ శాఖ. ప్రస్తుతం ఎంతోమంది మహిళామణులు ఇలా తమకు ప్రమాదం అనుకున్న సమయంలో ఏకంగా దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రమాదం నుంచి బయట పడుతున్నారు. అయితే ఇలా ఫిర్యాదు అందుకున్న కేవలం నిమిషాల వ్యవధిలోనే మహిళలను పోలీసులు రక్షించిన ఘటనలు ఇప్పటికే పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  కాస్త ఆలస్యమైనా మహిళ ప్రాణం పోయేది. కానీ సరైన సమయంలో స్పందించిన పోలీసులు ఏకంగా పది నిమిషాల వ్యవధిలో మహిళ ప్రాణాలను కాపాడారు.



 ఈ ఘటన ఏపీ లోని విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో వెలుగులోకి వచ్చింది. పురుగుల మందు తాగిన మహిళ దిశా కాల్ సెంటర్ కి అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసింది.  అర్ధరాత్రి అయినప్పటికీ పోలీసులు మాత్రం ఎలాంటి అలసత్వం చేయలేదు. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఇక బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది అని గమనించారు. వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. మహిళ తో పాటు ఐదేళ్ళ చిన్నారిని కూడా రక్షించగలిగారు. అయితే అఖిల్ అనే వ్యక్తి మోసం చేయడం కారణంగానే ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది అనే విషయాన్ని గుర్తించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: