నేటి రోజుల్లో రాజకీయ నాయకులు ఏదైనా పథకం ప్రవేశపెట్టారు అంటే చాలు..  ఇక ఆ పథకానికి తమ పేరు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు.  పేదలకు ఏదైనా పంచడం చేస్తే ఆ పంచిన వాటిపై పెద్ద పెద్ద ఫోటోలు వేసుకోవడం కూడా నేటి రోజుల్లో కామన్ గా మారిపోయింది.  ఒకసారి ఒక పార్టీ అధికారంలోకి వస్తే అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కనిపించకుండా అన్ని రకాల పేర్లు మార్చడం ఫొటోలు మార్చడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇటీవలే తమిళనాడు ఎన్నికల్లో గెలిచి మొదటిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన స్టాలిన్ మాత్రం రాజకీయ హుందాతనం అంటే ఏంటో చూపిస్తున్నారు.



 స్టాలిన్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రస్తుతం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.  ప్రజల హృదయాలను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రిగా ప్రస్తుతం స్టాలిన్ తన నిర్ణయాలతో ముందుకు దూసుకుపోతున్నారు.  ఇక ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాటలోనే ఎంకే స్టాలిన్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో యూపిలో యోగి అధికారంలోకి వచ్చిన సమయంలో స్కూల్ పిల్లలకు ఇచ్చే బ్యాగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు  అంతకు ముందు ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన  ఫోటోలతో కూడిన బ్లాగులు ఉన్నాయి. ఇక ఆ బ్యాగులను వృధా చేయకుండా మనం చేస్తున్న పనిలో మంచి కనిపించాలి కాని మనిషి కనిపించకూడదు అంటూ నిర్ణయం తీసుకుని ఎంతో హుందాగా ప్రవర్తించారు.


 ఇక ఇప్పుడు స్టాలిన్ కూడా  ఇదే తరహాలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఏకంగా 64 లక్షల బ్యాగులు స్కూల్ పిల్లలకు పంచాల్సి ఉంది. అయితే.. వీటి కోసం 13 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పగా  ఎందుకు అంత ఖర్చు అని ప్రశ్నించడంతో గత ప్రభుత్వ హయాంలో 64 లక్షల బ్యాగులు మిగిలిపోయాయ్. కానీ వాటిపై గత ముఖ్యమంత్రి ఫోటో ఉంది అంటూ చెప్పారట.  అయితే గత ముఖ్యమంత్రి ఫోటో ఉంటే ఏంటి ఫోటో లను చూసి ప్రజలు ఓట్లు వేయరు కదా ప్రజాధనాన్ని వృధా చేయడం ఎందుకు.. ఆ బ్యాగులనే పిల్లలకు పంచండి అంటూ ఆదేశాలు జారీ చేసి రాజకీయ హుందాతనాన్ని ప్రదర్శించారు అంటూ ప్రస్తుతం అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: