హెటిరో డ్రగ్‌ సంస్థ లో తవ్విన కొద్ది బయటపడుతున్న నోట్ల కట్టలు బయట పడుతున్నాయి. ఇప్పటి వరకు 16 లాకర్లను ఓపెన్‌ చేసిన ఐటీ అధికారులు...
అమీర్‌పేట్, సికింద్రాబాద్, శ్రీనగర్‌ కాలనీలో లాకర్లను కూడా  ఐటీ అధికారులు తెరిచారు. ప్రైవేట్‌ లాకర్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు.  అలాగే... 16 ప్రైవేట్‌ అల్మార్లను తెరిచిన ఐటీ అధికారులు ఒక్కొక్క అల్మారలో రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్ల నగదు ను స్వాధీనం చేసుకున్నారు.. అల్మార్లల్లోని రూ.30 కోట్ల నగదు సీజ్‌ చేసిన ఐటీ అధికారులు ఇప్పటికే రూ.142 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.  ఆరు రోజుల ఐటీ దాడుల్లో రూ.172 కోట్ల నగదు సీజ్‌ చేశారు ఐటీ  అధికారులు.  


రూ.550 కోట్ల అనుమానిత లావాదేవీలపై అధికారుల ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. కంపెనీ డబ్బులతో భారీగా భూములు కొనుగోలు చేసిన యాజమాన్యం...  20 లోపు తమ ఎదుట హాజరవ్వాలని నోటీసులు  జారీ చేశారు. ఇది ఇలా ఉండగా... హెటిరో సంస్థలపై ఐటీ దాడులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు  వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ సన్నిహితుల ఇళ్లల్లో కోట్లకు కోట్ల లెక్కల్లో లేని సొమ్ము పట్టుబడుతోందని విమర్శలు చేశారు.  

రెండునెలల క్రితం రాంకీ సంస్థ యాజమాన్యం ఇంట్లో రూ. 300 కోట్ల వరకు లెక్కల్లో లేని సొమ్ము పట్టుబడిందని.. .తాజాగా హెటిరో అధినేత పార్థసారథి రెడ్డి కంపెనీల్లో ఈరోజు రూ.142కోట్ల లెక్కల్లేని సొమ్ము దొరికిందని ఫైర్‌ అయ్యారు. సదరు హెటిరో సంస్థలో ఐటీ సోదాలు ఇంకా పూర్తి కాకముందే ఇనుప బీరువాల్లో కుక్కిన 500 నోట్ల కట్టలు పాముల్లా బయటపడ్ఢాయని.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొందరు ఆర్థిక ఉగ్రవాదుల చేతుల్లో పడి సతమతమవుతోందన్నారు.  ఐటీ శాఖ దాడులపై, ఆర్థిక ఉగ్రవాదుల అరాచకంపై కేంద్రహోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖా మంత్రి నిర్మలాసీతారామన్ కూడా దృష్టి సారించాలని డిమాండ్ చేశారు వర్ల రామయ్య.


మరింత సమాచారం తెలుసుకోండి: