అవసరాలకు తగ్గట్టుగానే రాజకీయాలు చేసే నాయకులు చాలా ఎక్కువగానే ఉంటారని చెప్పొచ్చు. కానీ జనాలకు....తమ అవసరాలు తెలిసేలా నాయకులు చేసుకోరు...ఏదైనా ప్రజల కోసమే చేస్తున్నట్లు చేస్తారు. కానీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఏంటో...క్లియర్‌గా తన అవసరాలకు తగ్గట్టుగానే రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన రాజకీయ జీవితం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇదే ప్రక్రియ నడుస్తుందని చెప్పొచ్చు. అవసరాలకు తగ్గట్టుగా పార్టీలు, నియోజకవర్గాలు మారుస్తూ వస్తున్నారు.

అయితే 2019 ఎన్నికల్లో మళ్ళీ టి‌డి‌పి నుంచి గెలిచాక గంటా..మళ్ళీ అదే టైప్ రాజకీయం చేయడానికి చూశారు. టి‌డి‌పి అధికారంలో లేకపోవడంతో, గంటా పార్టీ మారిపోవాలని అనుకున్నారు. అధికార వైసీపీలో చేరిపోవాలని డిసైడ్ అయ్యారు. కానీ అక్కడ అవంతి శ్రీనివాస్, విజయసాయి రెడ్డిలు అడ్డు చెప్పడంతో వైసీపీలో చేరడం కుదరలేదు. అలా అని టి‌డి‌పిలో మాత్రం గంటా కనిపించడం లేదు...అలాగే తనని గెలిపించిన విశాఖ నార్త్ ప్రజలకు కూడా ఎలాంటి సేవ చేయడం లేదు. ఎమ్మెల్యేగా నార్త్‌లో ఒక్క కార్యక్రమం చేయడం లేదు.

పూర్తిగా సైలెంట్‌గా ఉంటున్నారు. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలా అని స్టీల్ ప్లాంట్ కోసం పోరాడేది ఏమి లేదు. కేవలం రాజకీయం కోసమే రాజీనామా చేశారని జనాలకు క్లారిటీ ఉంది. ఇక తమ పార్టీలో ఏ మాత్రం కనిపించని గంటాని, టి‌డి‌పి నాయకత్వం గానీ, టి‌డి‌పి శ్రేణులు గానీ పట్టించుకోవడం లేదు.


గంటా ఇంకా తమ పార్టీ కాదని ఫిక్స్ అయిపోయారు. అందుకే విశాఖ నార్త్‌లో టి‌డి‌పికి కొత్త నాయకుడుని పెట్టాలని, పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతే బి‌జే‌పిలో యాక్టివ్‌గా ఉన్న విష్ణుకుమార్ రాజుని పార్టీలోకి తీసుకొచ్చి నార్త్ బాధ్యతలు అప్పగిస్తే బెటర్ అని అంటున్నారు. విష్ణుకు నార్త్‌పై పట్టు ఉందని, పార్టీకి కూడా ప్లస్ అవుతుందని చెబుతున్నారు. గంటా వల్ల పార్టీకి పావలా ఉపయోగం లేకపోగా, ఇంకా డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: