నంబ‌ర్ 2 కు నో ఛాన్స్
పార్టీలోనూ ప్ర‌భుత్వంలోనూ
అన్నీ తానే తానే అన్నియూ

 
ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్న విధంగా ఉంది రాజకీయం. నేనొచ్చానని చెప్పు తిరిగొచ్చానని అని జగన్ ను చూసి జనం మళ్లీ మళ్లీ అనుకోవాలి.. అంతలా తిరిగొచ్చిన విధంగా ఆయన రాజకీయం ఏం చేస్తున్నారని. చేసి ఏం సాధిస్తున్నారని.. ఏమయినా సినిమా డైలాగులు వైసీపీ వాడినంత ఈజీగా ఎవ్వరూ వాడరబ్బ! ఇప్పుడు జగన్ టీంలో నంబర్ 2 ఎవరు అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయనకు దగ్గరగా ఉండేవారిలో ఎవరు ఆ స్థానంలో ఉన్నారని.. నాడు వైఎస్ ఇలాకాలో ఓ విధంగా నంబర్ 2 రోశయ్య.. అంతగా కాకపోయినా ధర్మాన కూడా మంచి హవానే నడిపారు. బొత్సకు అప్పుడు ఎదురేలేదు. 




విచిత్రం ఏంటంటే రామకృష్ణా రెడ్డి కూడా మా క్యాబినెట్ లో కానీ పార్టీలో కానీ నంబర్ 2 అన్న పదానికే చోటు లేదు అంతా తానే అన్నీ తానే అని తేల్చేశారు. ఎంత గొప్ప మాట! మరోసారి కూడా అనుకోవచ్చు విన్నాక.! ఆ రోజు రోశయ్య మాట కాస్తయినా విన్నారు వైఎస్. కానీ జగన్ ఎవ్వరి మాట వినడం లేదు. సొంత సామాజికవర్గ నేతలకూ ఇప్పుడిక చుక్కలు కనిపించాల్సిందే!



ఓ విధంగా జగన్ టీంలో రోశయ్య లాంటి లీడర్లు లేరు. ఆ మాటకువస్తే జగన్ టీంలో కేవీపీలు లేరు. ఉండవల్లి లాంటి మీడియా ను ఫేస్ చేసే నేతలు అస్సలు లేరు. మీడియా ముందు మాట్లాడేవారంతా ఓ విధంగా జగన్ పరువు తీస్తున్నవారే. ముఖ్యంగా కొడాలి నాని, పేర్నినాని చాలు. ఆళ్ల నాని కొంతలో కొంత బెటర్. ఆ మాటకు వస్తే అంబటి కాస్త బెటర్. ఇంకా రోజాలాంటి లీడర్ల గురించి చెప్పక్కర్లేదు. సాయిరెడ్డి కూడా కొంత కాలం నంబర్ 2 అనే భావించి మీడియా ముందు నానా హడావిడి చేసినా జగన్ పక్కన బెట్టారు. బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి ఆ విధంగా ఆయన స్పీడుకు చెక్ పెట్టారు. ఆఖరికి పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఉభయ గోదావరి  జిల్లాల ఇంఛార్జ్ గా కూడా ఆయన రాణించలేకపోయారు. అక్కడ రాజమండ్రి ఎంపీ భరత్ మార్గాని, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య తగాదాను తీర్చలేకపోయారు. ఇక నంబర్ 2 అనే పదం లేకుండా చేయడానికి జగన్ చేసిన పనులన్నీ బాగానే ఫలితం ఇచ్చాయి. కనుక పార్టీని కట్టడి చేయడం, నాయకులను కట్టడి చేయడంలో జగన్ కు పాస్ మార్కులు కాదు ఫస్ట్ క్లాస్ మార్కులే పడ్డాయి. బొత్స, ధర్మాన లాంటి లీడర్లను ఎప్పుడో పక్కనబెట్టేశారు. ఇంకేం ఉంది..రాజశేఖర్ రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన వారంతా ఇక్కడ చీకటినే చూశారు..ఇకపై కూడా చూస్తారు.. ఇది ఫిక్స్ భయ్యా రాసుకో!




మరింత సమాచారం తెలుసుకోండి: