హ్యాకింగ్.. ప్రపంచమంతా ఇంటర్ నెట్ గుప్పిట్లోకి వెళ్లిపోయిన వేళ.. భద్రతకు ముప్పుతెస్తున్న సాంకేతిక ఉపద్రవమిది.. ప్రముఖ వెబ్ సైట్లను హ్యాక్ చేయడం.. కొంత మొత్తం డిమాండ్ చేయడం వంటి సైబర్ నేరాలు బాగా పెరిగాయి. ఇంకొందరు సైబర్ నేరగాళ్లు తమ సత్తా చూపించుకోవడం కోసం ప్రముఖుల వెబ్ సైట్లను, సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తుంటారు. తాజాగా ఏకంగా ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.


ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని ప్రధాని కార్యాలయం స్వయంగా ట్వీట్ ద్వారా తెలిపింది. ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతా @narendramodi స్వల్పంగా రాజీపడిందని ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అయితే అతి తక్కువ సమయంలోనే ఈ సమస్య పరిష్కారం అయ్యిందని పీఎంఓ తెలిపింది. నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాకైన విషయాన్ని పీఎంఓ ట్విట్టర్ సంస్థకు తెలిపింది. ట్విట్టర్ సంస్థ సమస్యను త్వరగా పరిష్కరించిందని పీఎంఓ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.


నరేంద్రమోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన సమయంలో వచ్చిన ట్వీట్లను పట్టించుకోవద్దని పీఎంఓ తెలిపింది. ఏకంగా ప్రధాని ఖాతా ట్విట్టర్ అయిన విషయం ఇప్పడు ట్విట్టర్‌లోనే ట్రెండింగ్‌ నిలిచింది. #hacking హ్యాష్ ట్యాగ్‌తో దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏకంగా ప్రధాని ఖాతానే హ్యాక్ కు గురికావడం సంచలనంగా మారింది.

 
ప్రధాని ఖాతా హ్యాక్ అయిన సమయంలో హ్యాకర్లు పెట్టిన పోస్టులను ట్విట్టర్ డిలీట్ చేసింది. అయితే.. అప్పటికే ఈ ట్వీట్లను చూసిన కొందరు స్క్రీన్ షాట్లతో వాటిని షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలపై పంచుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఈ ట్వీట్లను ట్విట్టర్ డిలీట్ చేసినందువల్ల ఈ స్క్రీన్ షాట్లను షేర్ చేయడం కూడా సరికాదు.. ఇది సమాచార దుర్వినియోగం కిందకు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎవరికైనా ఇలాంటి స్క్రీన్ షాట్లు కనిపిస్తే అత్యుత్సాహంతో మీరు కూడా షేర్ చేసి తర్వాత ఇబ్బందుల్లో పడొద్దు. ఏమంటారు..?


మరింత సమాచారం తెలుసుకోండి: