హస్తం పార్టీతో మరీ ముఖ్యంగా రేవంత్ పై వివాదంతో సహాయ నిరాకరణ చేస్తున్న అన్నదమ్ములు ఎమ్మెల్యేల ఫలితాలను ముందే పసిగట్టారా..? అందుకే జిల్లా పై మంచి పట్టు ఉన్న ఎన్నికలకు దూరంగా ఉన్నారా? కోమటి రెడ్డి ఫ్యామిలీ తెలంగాణ కాంగ్రెస్ కు ఆయువుపట్టు లాంటిది. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయ్యాక హస్తం తో అంటీ ముట్టనట్టు ఉంటున్న బ్రదర్స్ కొన్నాళ్ల నుంచి యాక్టివ్ గా కనిపిస్తున్నారు. కలిసికట్టుగా పావులు కదుపుతున్నారు. మొన్నటిదాకా కోమటిరెడ్డి బ్రదర్స్ ని పార్టీ హైకమాండ్ లైట్ తీసుకున్నా స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆ జిల్లాపై ఆ ఫ్యామిలీ పట్టెంటో గుర్తించి ఏవో బాధ్యతలు కూడా అప్పగించంది. అందుకే నల్గొండ జిల్లాలో పోటీకి దిగాలని నామినేషన్ల చివరి రోజు వరకు హస్తం పార్టీ కీలక నేతలు చర్చలు జరిపిన ఫలితం లేకుండా పోయింది.

 గట్టిపోటీని ఇచ్చే బలం ఉన్నా పార్టీ బరిలో నుండి తప్పుకోవడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అన్నీ ఆలోచించే కోమటిరెడ్డి బ్రదర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పెద్దగా రెస్పాండ్ కాలేదన్న చర్చ ఇప్పుడు హస్తం పార్టీ లో వినిపిస్తుంది.

 రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఏ కార్యక్రమాలకు హాజరు కాకుండా వారి వారి సమస్యలు, జిల్లా సమస్యల పైనే పోరాటం చేశారు. కానీ  మొన్నీమధ్య  రేవంత్ చేపట్టిన ఓ కార్యక్రమానికి హాజరై తమంతా ఒక్కటేనని చాటిచెప్పినంత పని చేశారు. కోమటిరెడ్డి అన్నదమ్ములు ఒప్పుకొని ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ గట్టిగా నిలబడి ఉండేదని ప్రత్యర్థులు ఎవరైనా ముచ్చెమటలు పట్టేవన్న టాక్ వినిపిస్తోంది. కానీ అన్నీ గమనించిన అన్నదమ్ములు కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో దించితే ఓటమి భారంతో ఉన్న పరువు కాస్తా పోయే ప్రమాదం ఉందని గ్రహించి పోటీకి దూరంగా ఉన్నారన్న చర్చ జరుగుతోందిప్పుడు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఉన్న ప్రయారిటీ ఏంటో ఇప్పుడు అధిష్ఠానానికి తెలిసి వచ్చిందని చెప్పుకుంటున్నారు వాళ్ల అనుచరులు, అభిమానులు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఏంటో, వారి వ్యూహ సామర్థ్యం ఏ మేరకు గ్రహించిందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: