చంద్ర‌బాబు ఉనికిని పూర్తిగా ప్ర‌శ్నార్థకం చేసేందుకు వైసీపీ చేస్తున్న ప్ర‌తి ప్ర‌య‌త్నం ఇటీవ‌ల బాగానే స‌క్సెస్ అవుతోంది.అయితే వీటిలో ఆ పార్టీ నాయ‌కుల ప్ర‌మేయం ఉందా లేదా అన్న‌ది ద‌ర్యాప్తులో తేలాల్సిన విష‌యాలు కానీ ప్రాథ‌మికంగా అయితే మాత్రం మంచి క‌న్నా చెడే ఎక్కువ‌గా వైసీపీ గురించి వినిపిస్తోంది.గుంటూరు గూండాల‌ను నియంత్రించాల్సిన బాధ్య‌త ను గౌర‌వ పోలీసు యంత్రాంగం మ‌రిచిపోయిందా లేదా వాళ్లంతా అధికార పార్టీ నాయ‌కులు క‌నుక వ‌దిలేసిందా? ఇదే ఇప్పుడు అంద‌రి నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న.గుంటూరు ఘ‌ట‌న త‌ర‌హాలో రేపు శ్రీ‌కాకుళంలో హ‌త్య‌లు జ‌ర‌గ‌వు అని అనేందుకు గ్యారంటీ ఏంటి?

ఒక‌నాడు ప్ర‌శాంతంగా ఉన్న‌ప‌ల్నాటి సీమ‌లు మ‌ళ్లీ ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు ఆన‌వాలు అయి ఉన్నాయి.ఎప్ప‌టి నుంచో ఉన్న పాత క‌క్ష‌ల కార‌ణంగానే హ‌త్య‌లు జ‌రుగుతున్నాయని చెప్ప‌డం ఎంత మాత్రం భావ్యం కాదు.ఓ అధికార పార్టీ త‌నకున్న శ‌క్తిని ఉప‌యోగించి హ‌త్య‌ల‌ను నిలువ‌రించేలా కానీ, త‌ప్పుకు తిర‌గ‌డం భావ్యం కాదు.ఈ విధంగా అయితే లా అండ్ ఆర్డ‌ర్ ను ఎవ‌రు కంట్రోల్ చేస్తున్నారు.విప్ పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డి నిందితులు అయిన వైసీపీ నాయ‌కుల ఇంటికి ముందు రోజు రాత్రి వ‌చ్చి వెళ్లాక హ‌త్య జ‌రిగింద‌ని బాధితులు వాపోతున్నారు.

పోనీ ఆయ‌న‌కు ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌మేయం లేద‌నే అనుకుందాం ఆరోప‌ణ‌లు రాగానే వాటిని నిరూపించుకోవాలి క‌దా! లేదు వెంట‌నే పోలీసులను అప్ర‌మత్తం చేయాలి క‌దా!  హ‌త్యా రాజ‌కీయాల‌ను ఏ ప్ర‌భుత్వం ప్రోత్స‌హించినా అది త‌ప్పే! అందులో మ‌రో ఆలోచ‌న‌కు తావే లేదు. కానీ వైసీపీ స‌ర్కారులో ప్ర‌శ్నిస్తే ప్రాణాలు తీస్తున్నార‌ని టీడీపీ ఎందుకు అంటోంది అంటే ఇటీవ‌ల ప‌రిణామాలు ఆ విధంగా ఉన్నాయి క‌నుక..ఎప్పుడు ఎవ‌రు చ‌నిపోతారో తెలియ‌దు..ఎవ‌రు ఎందుకు హ‌త్య‌కు లోన‌వుతారో తెలియ‌దు.. అస‌లు ఘ‌ట‌న‌ల‌న్నీ వైసీపీ పెద్ద‌ల నేతృత్వంలోనే జ‌రుగుతాయి అని టీడీపీ అంటుంది అంటే వ‌స్తున్న ప‌రిణామాల‌కు వివ‌ర‌ణ ఇవ్వాలి క‌దా! ఆ ప‌ని కూడా అధికార పార్టీ చేయ‌డం లేదు.
 
ప‌ల్నాటి హ‌త్య కు సంబంధించి, హ‌త్యా రాజకీయాల‌కు సంబంధించి విప‌రీతంగా వాగ్వాదాలు న‌డుస్తున్నాయి.ముఖ్యంగా ఈ వివాదంలో వైసీపీ నాయ‌కులే  నిందితులు అని టీడీపీ ఆరోపిస్తుంది.అదేవిధంగా వీడియో ఆధారాలు కూడా చూపిస్తోంది.ముఖ్యంగా గుండ్ల‌పాడులో ప‌ట్ట‌ప‌గ‌లే అత్యంత కిరాత‌కంగా టీడీపీ నేత తోట చంద్ర‌య్య‌ను చంపిన ఉదంతానికి సంబంధించి ప‌లు వార్త‌లు వ‌స్తున్నాయి.లా అండ్ ఆర్డ‌ర్ ను కంట్రోల్ చేయాల్సిన పోలీసులు వివాదాస్ప‌ద వ్య‌క్తులపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది. విప్ పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డి అనుచ‌రుల కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని సాక్షాధారాలు ఉన్నా పోలీసులు మాత్రం ఇంకా నిందితుల‌ను అరెస్టు చేయ‌లేదు.ఇంత‌కూ ఈ గూండాల‌కూ విప్ కూ ఉన్న సంబంధం ఏంటి?


మరింత సమాచారం తెలుసుకోండి: