ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రఖ్యాతిగాంచింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాలంతో సంబంధం లేకుండా ప్రతి సమయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా తిరుపతికి భక్తులు భారీగా తరలి వస్తూ ఉంటారు. ఏడుకొండలపై వెలసిన ముక్కోటి దేవుళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల  భాగ్యాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. కేవలం సామాన్యులు మాత్రమే కాదు అటు ఎంతో మంది సంపన్నులు సైతం తిరుమలకు విచ్చేసి ఏడుకొండలూ ఎక్కి స్వామి వారిని  దర్శించుకోవడం చేస్తూ ఉంటారు.



 అంతేకాకుండా ఇక స్వామి వారికి భారీగా విరాళాలు అందజేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఎంతోమంది సంపన్నులు. ఇకపోతే గతంలో కరోనా వైరస్ కారణంగా కొన్ని రోజుల పాటు భక్తులకు దర్శనం నిలిపివేస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ క్రమక్రమంగా దర్శనాల సంఖ్యను పెంచుతూ వచ్చారు. ఇప్పుడు భారీ మొత్తంలోనే భక్తులను అనుమతిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు అందరు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ వచ్చినా సర్టిఫికెట్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని టీటీడీ అధికారులు ఒక రూల్ పెట్టారు.


 కానీ ఇటీవలి కాలంలో ఎంతోమంది భక్తులు ఇలా టీకా సర్టిఫికెట్, కరోనా సర్టిఫికెట్ రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీటీడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే  ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేశారు టీటీడీ అధికారులు. తిరుమలకు రావడానికి 48 గంటల ముందు చేయించుకున్న ఆర్ టి పి సి ఆర్ నెగిటివ్ రిపోర్ట్ లేదంటే రెండు డోసుల టీకా వేసుకున్నట్లు సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి అంటూ టీటీడీ అధికారులు తెలిపారు. దీనిపై పలుమార్లు ప్రకటనలు చేసినా చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఆపి వెనక్కి పంపిస్తున్నాము అంటూ టీటీడీ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ttd