వివాదాస్పద ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం ఎదురైంది.ఇవాళ ఆమెను ఓటీఎస్ ఎందుకు చెల్లించాలంటూ కొందరు లబ్ధిదారులు నిలదీశారు. నిద్ర మండలం నగరం పంచాయతీ అగరం పేటలో ‘మీతో మీ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా ఆమెకు ఈ అనుభవం ఎదురయింది.దీంతో ఆమె ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు.గతంలో కూడా ఇటువంటి అనుభవాలే ఆమెకు ఉన్నాయి. అయితే వాటికి భిన్నంగా ప్రభుత్వం తీసుకున్న ఓ పాలన సంబంధ నిర్ణయంపై రోజాను లబ్ధిదారులు నిలదీయడం విశేషం.ఎందుకంటే ఆ నిర్ణయానికీ, దాని వెనుక ఉన్న నేపథ్యానికీ రోజాకు సంబంధం లేకున్నా లబ్ధిదారులు మాత్రం తమ ప్రాంత ఎమ్మెల్యేకు ఇవన్నీ ఎందుకు పట్టవు అన్న పంతంలో భాగంగా ఆమెపై సీరియస్ అయ్యారు.
ఓటీఎస్ లో భాగంగా గృహ నిర్మాణ హక్కులు పొందేందుకు తాము ఎందుకని పదివేలు చెల్లించాలని లబ్ధిదారులు రోజాను ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విశ్లేషణాత్మకంగా చెప్పే ప్రయత్నం ఆమె చేసినప్పటికీ లబ్ధిదారులు వినిపించుకోలేదు దీంతో ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆమెను ఉద్దేశించి గో బ్యాక్ అని చెప్పారు. నగరి ప్రాంతంలో ఎక్కువగా తమిళులు ఉండడంతో వారికి ఆ ప్రాంత భాషలోనే చెప్పే ప్రయత్నం ఒకటి రోజా చేసినా కూడా ఆఖరి వరకూ అది ఫలితం ఇవ్వలేదు.దీంతో ఆమె తీవ్ర పరాభవంతో వెనుదిరిగారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి