అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సరే...ఇంకా చాలా నియోజకవర్గాల్లో వైసీపీ హవా తగ్గడం లేదు..చాలా చోట్ల వైసీపీ స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది...ఏదో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీపై ప్రజా వ్యతిరేకత రావడం, అదే సమయంలో టీడీపీ నేతలు పుంజుకోవడం వల్ల రాజకీయాలు మారాయి గాని...కొన్ని చోట్ల మాత్రం వైసీపీ తగ్గేదేలే అన్నట్లే ఉంది. అలా టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో రెండు స్థానాల్లో వైసీపీ బాగా బలంగా కనిపిస్తోంది....మిగిలిన స్థానాల్లో కూడా స్ట్రాంగ్ గానే ఉంది గాని...అనంతపురం అర్బన్, గుంతకల్లు స్థానాల్లో వైసీపీ ఇంకా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. మళ్ళీ ఎన్నికల్లో ఈ రెండు చోట్ల ఫ్యాన్ హవా నడిచేలా ఉంది.

అనంతపురం అర్బన్ స్థానంలో ముందు నుంచి వైసీపీకి కాస్త పట్టు ఉందని చెప్పొచ్చు...2012 ఉపఎన్నికల్లో ఇక్కడ వైసీపీ సత్తా చాటింది..ఇక 2014 ఎన్నికల్లో ఓడిపోయిన సరే 2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిచింది. వైసీపీ నుంచి అనంత వెంకట్రామి రెడ్డి విజయం సాధించారు...ఇక ఈయనే ఇప్పుడు అర్బన్ లో వైసీపీకి పెద్ద దిక్కు. అనంత పనితీరు వల్ల అర్బన్ స్థానంలో ఇంకా వైసీపీ బలం పెరిగిందని చెప్పొచ్చు..ఈ మూడేళ్లలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ...పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఇలా చేయడం వల్లే అనంత అర్బన్ లో వైసీపీ బలం ఏ మాత్రం తగ్గలేదు...ఇక్కడ టీడీపీ నేత ప్రభాకర్ చౌదరీ బలం పెద్దగా పెరగలేదు.  

అటు గుంతకల్లు స్థానంలో కూడా వైసీపీ బలంగా కనిపిస్తోంది...ఇక్కడ ఎమ్మెల్యే వై.వెంకట్రామి రెడ్డి పనితీరుకు మంచి మార్కులే పడుతున్నాయి...అలాగే ఇక్కడ టీడీపీ నేత జితేంద్ర గౌడ్ అనుకున్న స్థాయిలో పికప్ కాలేదు. ఇటీవల వస్తున్న కొన్ని సర్వేల్లో కూడా గుంతకల్లులో వైసీపీకి మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి అనంతపురం జిల్లాలో అర్బన్, గుంతకల్లు స్థానాల్లో ఫ్యాన్ హవా స్పష్టంగా ఉంది...ఈ రెండు చోట్ల వైసీపీ మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: