ఈ మధ్య నాన్ వెజ్ ధరలు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే..ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు చికెన్ ధరలు కూడా కిందకు దిగి వచ్చాయి..పౌల్ట్రీ యజమానులను కూడా తీవ్రమైన చిక్కుల్లో పడేస్తున్నాయి. దీంతో కనీస ఖర్చుకి తగ్గట్టుగా పౌల్ట్రీ యజమానులు హోల్ సేల్ ధరలకే చికెన్ షాపులకు కోళ్లను అమ్మేస్తున్నారు..చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గడంతో నాన్ వెజ్ ప్రియులు చికెన్ కోసం ఎగబడుతున్నారు..



వివరాల్లొకి వెళితే..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పౌల్ట్రీ యజమానులకు తమ ఫారంలకు వెళ్లి మెయింటెన్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవి అయితే మునిగిపోయే పరిస్థితి నెలకొంది. వర్షాలు కాస్త తగ్గాక తిరిగి కోళ్లకు దాణా వేయడం వాటి సంరక్షణ చర్యలు తీసుకోవడానికి విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. తగ్గాయి అనుకున్న వర్షాలు మళ్లీ మొదలు కావడంతో ఇక పౌల్ట్రీ నిర్వాహకులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. 



వచ్చేది శ్రావణ మాసం కావడంతో మెజారిటీ ప్రజలు నాన్ వెజ్ కు దూరంగా ఉంటారు. దీంతో తమకు నష్టాలు తప్పవని భావించిన పౌల్ట్రీ నిర్వాహకులు అతి తక్కువ ధరలకే చికెన్ షాపులకు కోళ్లను అమ్మడం మొదలు పెట్టారు.మరోవైపు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి చికెన్ షాపు యజమానులు సైతం తక్కువ ధరకే అమ్మాలని నిర్ణయించుకున్నారు. దీంతో మొన్నటివరకూ రెండు వందల ఎనభై రూపాయలు నుంచి దాదాపు 300 రూపాయల వరకు పలికిన చికెన్ ఒక్కసారిగా సగం కంటే తక్కువ ధరకే పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో 100 రూపాయలకే చికెన్ అమ్ముతూ ఉండటంతో జనాలు ఎగబడి కొన్నారు. తెలంగాణలో బోనాలు కూడా రావడంతో జనాలు లైవ్ కోళ్లను కొని అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడం కనిపిస్తోంది. ఏదేమైనా వర్షాలు అటు చికెన్ పౌల్ట్రీ యజమానులకు చుక్కలు చూపిస్తే వినియోగదారులకు మాత్రం పండగ వాతావరణాన్ని డబుల్ చేశాయి. పదుల సంఖ్యలో వెరైటీలు చేయగలిగే చికెన్ ఇంత తక్కువ ధరకు దొరుకుతూ ఉండడంతో చికెన్ షాపుల వద్ద జనాలు క్యూ కడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: