ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు దాఖలుచేసిన పిటీషనర్ ను హైకోర్టు వాయించేసింది. అసలు ప్రభుత్వ కార్యక్రమంలో తప్పేముందని నిలదీసింది. ఇంతకీ విషయం ఏమిటంటే వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలతో పాటు మున్సిపల్, పంచాయితీరాజ్ శాఖల అధికారులతో పాటు వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. దాంతో ప్రతిపక్షాలకు మండిపోయింది.





అందుకనే ఒక జర్నలిస్టును అడ్డంపెట్టుకుని టీడీపీనే కార్యక్రమం అమలుకు వ్యతిరేకంగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలుచేయించింది. ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను ఏదో రకంగా తప్పుపడుతు టీడీపీ ఇప్పటికే చాలా కేసులు వేయించిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు వందకు పైగా పిల్లులను టీడీపీ వేయించింది. అదే విధంగా ఈ కార్యక్రమంపైన కూడా పిల్ పడింది. దీన్ని కోర్టు విచారించింది. ప్రభుత్వాన్ని సతాయించటమే టీడీపీ పనిగా పెట్టుకున్నది. 





విచారణ సందర్భంగా వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది పాల్గొంటే వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలని అడిగింది. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగం పాల్గంటే వచ్చిన సమస్య ఏమిటో చెప్పాలని పిటీషర్ ను నిలదీసింది. దాంతో పిటీషనర్ కు ఏమి చెప్పాలో అర్ధంకాలేదు. కేంద్రప్రభుత్వంతో పాటు చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ సిబ్బంది ద్వారానే జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తుచేసింది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను జనాలకు తెలియజేయాలని అనుకోవటంలో తప్పేముందని ప్రశ్నించింది.





అమలుచేస్తున్న పథకాలు, అభివృద్ధి విషయంలో  ప్రభుత్వాలు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటంలో తప్పులేనపుడు ప్రభుత్వ సిబ్బంది పాల్గొంటే తప్పేముందని అడిగింది. దానికి పిటీషనర్ నుండి సమాధానం లేదు. అసలు హైకోర్టు ఈ విధంగా ఎదురు ప్రశ్నిస్తుందని పిటీషనర్ తరపు లాయర్ ఊహించినట్లు లేదు. అందుకనే ఏమి సమాధానం చెప్పాలో దిక్కుతోచలేదు. దాంతో విచారణను డిసెంబర్ నెలకు వాయిదా వేసింది. మొత్తానికి ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎలాగోలా నిలిపేయించాలని టీడీపీ చేసిన ప్రయత్నం ఫెయిలైందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: