
ఇటీవల విడుదలైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అటు బిఆర్ఎస్ పార్టీ కేవలం 39 స్థానాలకు మాత్రమే సరిపెట్టుకొని.. ప్రతిపక్ష హోదాని దక్కించుకుంటే.. అటు మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలను దాటి కాంగ్రెస్ 64 సీట్లను దక్కించుకుంది. దీంతో అధికారాన్ని చేపట్టేందుకు మరో పార్టీ సహాయం తీసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉండబోతుందో అనే విషయంపై కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు.
అయితే ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి కొత్తగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అన్నది కూడా హాట్ టాపిక్ మారిపోయింది.. ఆ వివరాలు చూసుకుంటే..
పాలకుర్తి నుంచి 26 ఏళ్ల యశస్విని రెడ్డి మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతుంది.
మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మైనంపల్లి రోహిత్ అసెంబ్లీలో మొదటిసారి అడుగుపెట్టబోతున్నాడు.
వీళ్లు మాత్రమే కాకుండా వేములవాడ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆది శ్రీనివాస్, రామగుండంలో విజయ డంక మోగించిన మక్కాన్సింగ్ ఠాగూర్, ఇక చెన్నూరు లో గెలుపొందిన వివేక్ వెంకటస్వామి, కల్వకుర్తిలో విక్టరీ కొట్టిన కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎల్లారెడ్డిలో విజయం సాధించిన మదన్మోహన్రావు, తుంగతుర్తిలో విజయం సాధించిన మందుల శ్యామ్యూల్ ఇలా ఎన్నికల్లో విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలో ఎమ్మెల్యే హోదాలో అడుగు పెట్టబోతున్నారు. ప్రజాగళం వినిపించబోతున్నారు.