కాపు సంక్షేమ నేత మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కుమారుడు చేగొంటి సూర్యప్రకాష్ పవన్ కళ్యాణ్ చేస్తున్న పనుల వల్ల తాను విసిగిపోయామని పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ అసలు విలువ ఇవ్వరంటూ కూడా హరి రామజోగయ్య కుమారుడు తెలియజేశారు.జనసేన పిఎసి కమిటీ సభ్యుడుగా ఉన్నటువంటి సూర్య ప్రకాష్ వాటికి రాజీనామా చేసి పలు విషయాలను తెలియజేశారు.. సినిమా హాళ్ల వద్ద టికెట్లు కొసం థియేటర్స్ బయట ఎలా నిలబడాలో పవన్ కళ్యాణ్ ఇంటి బయట జనసేన టికెట్ల కోసం నిలబడాలంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు.. పైకి కనిపించే పవన్ వేరని తెర వెనుక పవన్ కళ్యాణ్ వేరు అంటూ కూడా విమర్శించడం జరిగింది.ఆరు సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం పని చేస్తే ఇప్పటి వరకు కేవలం అరగంట మాత్రమే తమతో మాట్లాడించేలా చేశారని తెలియజేశారు..దీంతో ఆయన సాయంత్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం జరిగింది.. ఈ మేరకు వైసిపి నేత సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి మరి ఆహ్వానించారు.. వైసీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా తెలియజేశారు.


టిడిపి నేత చంద్రబాబు నాయుడును లోకేష్ ను సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ ఎక్కువగా పనిచేస్తున్నారని హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ వ్యాఖ్యానించారు. అంతేతప్ప తమ పార్టీ అభివృద్ధి కోసం ఎలాంటి పనులు చేయాలని ఎక్కడ కష్టపడరని తెలియజేశారు.. పార్టీని నమ్ముకున్న వారంతా పవన్ కళ్యాణ్ మోసం చేశారని వెల్లడించారు.. జనసేన పార్టీలో పీఏసీ సభ్యులుగా ఉన్న తనకే పార్టీలు ఎలాంటి స్వేచ్ఛ లేకపోవడంతో పాటు మాట్లాడే అవకాశం కూడా లేదంటూ ఆయన ఆరోపించారు.. కేవలం నాదెండ్ల మనోహర్ చెప్పే మాటలను తప్ప పవన్ కళ్యాణ్ ఎవరు మాటలు పట్టించుకోరని ఎవరైనా ప్రశ్నిస్తే వైసిపి కోవర్టులు అంటూ పలు రకాల ముద్రలు వేస్తారంటూ ఆయన ఆరోపించారు.. అందుకే వైసిపి పార్టీలో చేరామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: